ఫలానా క్రీము ముఖాని కి మర్ధన చేస్తే ముఖవర్చస్సు తళతళా మెరిసిపోతుంది! అనే ప్రకటన వెనక ఎలాంటి భయానక నిజం ఉందో ఇప్పుడు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఫెయిర్ నెస్ క్రీముల కంపెనీలు ప్రచార ఝంజాటంతో ప్రజలు ఎలా బురిడీ కొట్టిస్తాయో ఈ మాటలు వెల్లడించాయి. తన కెరీర్ ప్రారంభంలో స్కిన్ ఫెయిర్ నెస్ క్రీమ్ ల కోసం ప్రకటనలలో నటించినందుకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ప్రియాంక చోప్రా బాలీవుడ్ సహా సినీపరిశ్రమల్లో కలరిజం పిచ్చి గురించి చర్చించింది. ఇటీవల ప్రఖ్యాత టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ప్రియాంక చోప్రా తాను ఇండియా వదిలి అమెరికా వెళ్లడాని కి హాలీవుడ్ లో నటించడాని కి అసలైన కారణాలను బహిర్గతం చేసింది. పరిశ్రమలో కొందరు పెద్దలు తనను బహిష్కరించారనే విషయాన్ని వెల్లడించింది. ఇదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో కలరిజం గురించి మాట్లాడింది. స్కిన్ ఫెయిర్ నెస్ క్రీములతో ఒరిగేదేమీ ఉండదని కూడా క్లారిటీ నిచ్చింది.
2000లో ప్రపంచ సుందరి పోటీలో విజేత గా నిలిచాక ప్రియాంక చోప్రా 2002లో తమిళ చిత్రం 'తమిజన్'తో నటిగా తెరంగేట్రం చేసింది. 2003లో 'ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై'తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సినీఆరంగేట్రం చేసాక అన్ని పరిశ్రమల్లో ప్రారంభ రోజుల్లో తన రంగు (వర్ణవాదాన్ని)ను కించపరిచిన వారిని చూసింది. అనేక సినిమాలలో తెర పై చాలా సింపుల్ గా కనిపించానని తెలిపింది. 2000 సంవత్సరం నుంచి ఆ దశాబ్ధ కాలంలో యువతులు మరింత అందంగా ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని వాగ్దానం చేసిన 'డ్యామేజింగ్' స్కిన్ ఫెయిర్ నెస్ యాడ్స్ లో భాగమైనందుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. ఫెయిర్ నెస్ క్రీములతో ఒరిగేదేమి ఉండదని కూడా పరోక్షంగా హింట్ ఇచ్చింది.
తాను సినిమాల్లో చేరిన తర్వాత ముఖ్యంగా సోషల్ మీడియాల రాకతో స్టోరీలు మారడం మొదలైందని ప్రియాంక తెలిపింది. భారతీయుల మధ్య ఇలాంటి వర్ణ వివక్షకు సంబంధించిన హానికర మైన మూస పద్ధతుల గురించి మాట్లాడి తన తరాని కి ప్రతినిధిగా నిలిచింది. ఇది భారతీయులకు చిన్నప్పటి నుండి నేర్పించబడిన సాంస్కృతిక పాఠం అని పీసీ అభిప్రాయపడింది.
నేను సినిమా రంగంలో చేరినప్పుడు కాస్టింగ్ ఏజెంట్లు న్యాయం గా ఉంటే ఏదో ఒక అవకాశం గ్యారెంటీ గా వరించేది. కానీ మీరు ముదురు రంగులో ఉంటే చిక్కులు తప్పవు. అయితే నేను మరీ అంత చీకటి రంగులో లేను. ముదురు రంగు అమ్మాయిల కు ఈ లుక్ బాగానే ఉంటుంది. కానీ నిన్ను కాంతివంతం చేస్తామని చెబుతారు. నేను చాలా సినిమాల్లో ఇలాగే వెలుగులోకి వచ్చాను'' అని ఆమె పోడ్కాస్ట్ ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్ లో డాక్స్ షెపర్డ్ తో చెప్పింది. మేకప్ - లైటింగ్ స్కీమ్ తో స్క్రీన్ పై మరింత అందంగా కనిపించానని నిజాయితీగా వెల్లడించింది.
మాకు హాని కలిగించే చెత్త విషయాలు నేర్పించారు. నేను కూడా ఆ మాయలో చిక్కుకున్నాను. వెనక్కి తిరిగి చూస్తే ఆ వాణిజ్య ప్రకటన చాలా నష్టపరిచిందని పీసీ అన్నారు. ప్రకటన తీరు గురించి చెబుతూ... ''నేను ముదురు రంగులో కనిపిస్తాను... ఓ వ్యక్తి పువ్వులు అమ్ముతూ వస్తాడు.. కనీసం నా వైపు కూడా చూడడు. నేను ఈ క్రీమ్ ని ఉపయోగించడం ప్రారంభించగానే నాకు ఉద్యోగం వస్తుంది. నేను ఆ వ్యక్తి కి చేరువవుతాను... నా కలలన్నీ నిజమైపోతాయి'' అంటూ కాస్త వ్యంగ్యంగా గుర్తు చేసుకున్నారు. 2000 మధ్యకాలం అది. సైఫ్ అలీ ఖాన్- నేహా ధూపియా కూడా ప్రియాంకతో ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రచారంలో భాగం. ఈ ప్రకటనల సిరీస్ లో ముక్కోణ ప్రేమలో ముగ్గురు నటులు ఆహార్యం ప్రదర్శించారు.
ప్రియాంక ఇప్పుడు లాస్ ఏంజెల్స్ కు మకాం మార్చింది. అక్కడ తన భర్త- గాయకుడు నిక్ జోనాస్ - కుమార్తె మాల్టీ మేరీ జోనాస్ తో కలిసి నివసిస్తున్నారు. పీసీ చివరిసారిగా 2021లో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్'లో సతీ పాత్రలో కనిపించింది. వచ్చే నెలలో ప్రైమ్ వీడియో సిటాడెల్ ప్రీమియర్ కి సిద్ధమవుతోంది. సామ్ హ్యూగన్ సరసన 'లవ్ ఎగైన్ ' అనే రోమ్-కామ్ లో నటించనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.