Begin typing your search above and press return to search.

భారీ డీల్ తోనే ఓటీటీలోకి 'గెహ్రియాన్‌'

By:  Tupaki Desk   |   13 Feb 2022 3:48 AM GMT
భారీ డీల్ తోనే ఓటీటీలోకి గెహ్రియాన్‌
X
వెండితెర మీద సినిమా చూసే అలవాటును తగ్గించిన క్రెడిట్ కరోనాకే వెళుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా హాల్ కు వెళ్లి సినిమా చూడటం ఒక సాహసంగా ఫీలయ్యే వారు ఎక్కువగానే ఉన్నారు. దీనికి తోడు.. సినిమా థియేటర్ కు వెళ్లి వ్యయ ప్రయాసలతో సినిమాను చూసే కన్నా.. కాస్త ఓపిక పడితే చాలు సినిమాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు 'ఒరిజినల్' పేరుతో కొత్త సినిమాల్ని థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్న కొత్త ట్రెండ్ మొదలైంది.

సాదాసీదా సినిమాలు.. చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు.. ఇప్పుడు కాసులు కురిపించే అవకాశం ఉన్న భారీ సినిమాల్ని సైతం ఓటీటీ సంస్థలు సొంతం చేసుకుంటున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనంగా 'గెహ్రియాన్‌' మూవీని చెప్పొచ్చు.

దీపికా పదుకునే బోల్డ్ గా నటించిన ఇంటిమేటెడ్ సీన్లతో ఈ సినిమా మీద భారీ చర్చ సాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ చర్చే.. సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్లటమే కాదు.. ఈ సినిమా విడుదల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి.

పెళ్లైన తర్వాత.. దీపిక నటించిన మూవీల్లో 'గెహ్రియాన్‌' సో స్పెషల్ గా చెబుతున్నారు. తన కంటే పదేళ్లకు పైనే చిన్నోడైన నటుడితో చెలరేగిపోయి.. రొమాన్సు సీన్లు చేసిన దీపిక వైనంపై ఇప్పటికి చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద నేరుగా విడుదల చేసేందుకు వీలుగా అమెజాన్ సంస్థ భారీ డీల్ కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఏకంగా రూ.వంద కోట్ల భారీ ఆఫర్ ఇవ్వటంతో.. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా నిర్మాతలు ఓటీటీలో విడుదలకు ఓకే చెప్పేశారంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా శుక్రవారం విడుదల కావటం.. పెద్ద ఎత్తున వ్యూస్ వస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా బోల్డ్ సీన్లతో దీపికా చెలరేగిపోతే.. ఈ సినిమా కోసం అమెజాన్ మరింత తెగించి.. భారీ ధరకు ఓకే చెప్పటంతో.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద నేరుగా విడుదలైంది. భారీ ఎత్తున వ్యూయర్లు ఈ మూవీని వీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.