Begin typing your search above and press return to search.

వీడియో : హ్యాపీ బర్త్‌ డే నాన్న

By:  Tupaki Desk   |   9 Aug 2020 1:01 PM GMT
వీడియో : హ్యాపీ బర్త్‌ డే నాన్న
X
నేడు మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా కొన్ని లక్షల మంది కోట్ల మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే మహేష్‌ బాబుకు ప్రత్యేకమైన వ్యక్తి ఆయన తనయుడు గౌతమ్‌ కృష్ణ. తన ఇన్‌ స్టా అకౌంట్‌ ద్వారా గౌతమ్‌ కూడా మహేష్‌బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. మహేష్‌ కు గౌతమ్‌ చెప్పిన పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను మహేష్‌ అభిమానులు తెగ ట్రెండ్‌ చేస్తున్నారు.

వీడియోలో గౌతమ్‌.. హ్యాపీ బర్త్‌ డే నాన్న. ఈ ఏడాది మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. త్వరలో ఈ కోవిడ్‌ 19 పరిస్థితుల నుండి అంతా బయట పడాలని మీరు సినిమా చేయాలని ఆశిస్తున్నాను. మీ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను అన్నట్లుగా గౌతమ్‌ వీడియోలో పేర్కొన్నాడు. చాలా కామ్‌ గా సైలెంగ్‌ గా ఉండే గౌతమ్‌ ఈ వీడియోను చేయడం ద్వారా వైరల్‌ అయ్యింది. ఇదే సమయంలో సితార కూడా తన అఫిషియల్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌ లో నాన్న మహేష్‌ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.