Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్: గంగూబాయి రూపంలో గంభీరంగా ఆలియా భట్

By:  Tupaki Desk   |   15 Jan 2020 3:59 PM GMT
ఫస్ట్‌ లుక్: గంగూబాయి రూపంలో గంభీరంగా ఆలియా భట్
X
బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తున్న తాజా సినిమా 'గంగూబాయి ఖథియావాడి'. మాఫియా క్వీన్ అనే ట్యాగ్ లైన్‌ తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భనాల్సీ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కథాంశంతో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

చిత్రంలో ఆలియా రెండు విభిన్న పాత్రలు పోషిస్తోంది. యంగ్ లేడీగా - ఓల్డేజ్ మహిళగా ఆలియా నటన అబ్బురపరచనుందని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఈ సినిమా నుంచి ఆలియా భట్ ఫస్ట్‌ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లలో పవర్‌ ఫుల్‌ లుక్‌ తో కనిపిస్తున్న ఆలియా సినిమాపై అంచనాలు పెంచేసింది.

భన్సాలీ ప్రొడక్షన్స్ కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్టర్‌ లో ఆలియా యంగ్ లుక్‌ లో కనిపిస్తుండగా - మరో పోస్టర్‌ లో నుదుట పెద్ద తిలకం ధరించి గంభీరంగా కనిపిస్తోంది. మాఫియా క్వీన్ గంగూబాయి ఖథియావాడి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11వ తేదీ 2020న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.