Begin typing your search above and press return to search.

వల్లంకి పిట్ట చిన్నారి ఇంతలో ఎంత మార్పు!

By:  Tupaki Desk   |   4 May 2021 5:30 PM GMT
వల్లంకి పిట్ట చిన్నారి ఇంతలో ఎంత మార్పు!
X
అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయిన గంగోత్రి సినిమాలో బేబీ కావ్య పాత్రను ఎవరు మర్చి పోలేరు. హీరోయిన్‌ చినప్పటి పాత్రను బేబీ కావ్య పోషించింది. విభిన్నమైన కళ్లు మరియు ఆ పాప నడవడిక అన్ని కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బేబీ కావ్య గంగోత్రి సమయంలోనే చాలా సినిమాల్లో కనిపించింది. అయిదు పది నిమిషాల పాత్రలు చాలానే చేసింది. కాని గత కొన్నాళ్లుగా కావ్య సినిమాల్లో కనిపించడం లేదు. గంగోత్రి సమయంలో వల్లంకిపిట్ట అంటూ పాడిన కావ్యకు 4 ఏళ్లు మాత్రమే. ఇప్పుడు కావ్య 18 ఏళ్లు క్రాస్‌ చేసింది. కావ్య ఇప్పుడు ఎలా ఉండి ఉంటుందా అంటూ కొందరు అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో కావ్య నుండి హాట్ ఫొటో షూట్‌ వచ్చింది.

వల్లంకి పిట్ట పాటతో అందరి ఆకట్టుకున్న ఆ పిల్లి కళ్ల కావ్య ఇప్పుడు వావ్ అనిపించేలా మారింది. హాట్‌ ఫొటో షూట్ లతో రెగ్యులర్‌ కమర్షియల్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంది. హీరోయిన్‌ గా ఈ అమ్మడు ఆఫర్లు ఆశిస్తుంది. త్వరలోనే ఈమె చిన్నదో పెద్దతో ఏదో ఒక సినిమా లో ఆఫర్‌ అయితే దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది. గంగోత్రి సినిమాలోని కావ్య అప్పుడే ఇంతగా పెరిగిందా.. ఆ చిన్నారి ఇలా వయ్యారిగా మారిందా అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ముందు ముందు కావ్య మరిన్ని హాట్ ఫొటో షూట్ లు మరియు పాత్రలతో అలరిస్తూ ఎంటర్ టైన్‌ చేస్తుందేమో చూడాలి.