దేకో దేకో గబ్బర్ సింగ్ .. డైరెక్షన్ అట!!

Mon May 20 2019 19:10:16 GMT+0530 (IST)

Ganesh master Turns As Director

దేకో దేకో గబ్బర్ సింగ్.. అంటూ పవన్ తో అదిరిపోయే స్టెప్పులేయించారు గణేష్ మాస్టార్. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్.. సర్ధార్ గబ్బర్ సింగ్... కొరియోగ్రాఫర్ గా అతడు సుపరిచితం. ఆయనకు  టాలీవుడ్ లో ఉన్న పాపులర్ ఎలాంటిదో చెప్పాల్సిన పనేలేదు. ఇండస్ట్రీ టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదురేలేని వాడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా మారుతున్నారని సమాచారం.గణేష్ మాస్టార్ దర్శకత్వం అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా.. అధికారికంగా కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో కొత్త వారితో సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరో 2 నెలల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమచారం. అతడికి సినిమా అంటే ఉన్న ప్యాషన్ ఎంతో గొప్పది. ప్రతి నిమిషం సినిమా గురించే ఆలోచిస్తారని సన్నిహితులు చెబుతారు. ఇక దర్శకత్వం అన్నా అంతే ప్యాషన్ అని ఆయనతో పని చేసిన పలువురు చెబుతున్నారు. ప్రభుదేవా.. లారెన్స్ మాస్టార్ల స్ఫూర్తితో పెద్ద దర్శకుడవ్వాలన్న పంతంతో ఉన్నారని తెలుస్తోంది.

ఆ శుభ ముహూర్తం కోసమే వెయిటింగ్. ప్రస్తుతం స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. సంగీతాభిరుచి ఉన్న కొరియోగ్రాఫర్ కాబట్టి  కాస్తంత ట్యూన్ల కోసం భారీ కసరత్తునే చేస్తున్నారట. ఇక సినిమా మొదలు పెట్టాలంటే కాస్టింగ్ పరమైన ఎంపికలు పూర్తి కావాల్సి ఉంటుంది. గణేష్ మాస్టార్ అంతటివాడు దర్శకుడవుతానని అంటే ప్రోత్సహించనిది ఎవరు?  ఇండస్ట్రీ యావత్తూ ఆయన వెంట ఉంటుంది. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ .. చరణ్ అంతటివారి నుంచి ప్రమోషనల్ సాయం ఉంటుంది. పవన్ రేంజు స్టార్ తో ఫస్ట్ లుక్ కి ప్లాన్ చేయొచ్చు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్.. సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్.. సురేష్ ప్రొడక్షన్స్.. యువి క్రియేషన్స్.. గీతా ఆర్ట్స్.. ఇలా అన్ని అగ్ర బ్యానర్లతో సత్సంబంధాలున్నాయి. అగ్ర నిర్మాతలంతా అతడిని ప్రోత్సహించేందుకు రెడీగా ఉంటారు. మరి ప్రయత్నంలో లోపం లేకపోతే చాలు. గణేష్ మాస్టార్ దర్శకుడిగానూ సక్సెస్ సాధించే వీలుంటుంది. కథ కంటెంట్.. కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఈరోజుల్లో. చూద్దాం అధికారికంగా ఆయనే ఆ సంగతిని ప్రకటిస్తారేమో.