Begin typing your search above and press return to search.

పఠాన్ ముందు వెలవెలబోయిన గాంధీ గాడ్సే

By:  Tupaki Desk   |   31 Jan 2023 8:00 AM GMT
పఠాన్ ముందు వెలవెలబోయిన గాంధీ గాడ్సే
X
రిపబ్లిక్ డే సందర్భంగా బాలీవుడ్‌ నుండి వచ్చిన పఠాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ నుండి వచ్చిన ఏ ఒక్క సినిమా చూడని వసూళ్లను పఠాన్ చూసింది. ఇప్పటికే రూ.500 కోట్ల వసూళ్లను పఠాన్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో విడుదల అయిన గాంధీ గాడ్సే ఏక్ యుధ్ సినిమా కు మాత్రం నిరాశే మిగిలింది.

కమర్షియల్‌ సినిమాతో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్‌ మూవీ లేదా కంటెంట్‌ ఓరియంటెడ్‌ మూవీ వస్తే ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ మసాలా మూవీగా పఠాన్ సినిమా ఉంది. యాక్షన్‌ ప్రేమికులతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా పఠాన్ సినిమా ఉండటంతో రికార్డ్‌ బ్రేకింగ్ కలెక్షన్స్ వస్తున్నాయి.

పఠాన్ తుఫాన్‌ లో అసలు గాంధీ గాడ్సే సినిమా వచ్చిందనే విషయాన్ని కూడా చాలా మంది ప్రేక్షకులు పట్టించుకోలేదు. చూసిన వారు పర్వాలేదు బాగానే ఉందని మౌత్‌ టాక్ ప్రచారం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. చాలా థియేటర్లలో రెండవ రోజు నుండే షో లు క్యాన్సల్‌ అయ్యాయి.

పఠాన్ సినిమా తో గాంధీ గాడ్సే ఏక్ యుధ్‌ సినిమా పోటీ పడటం వల్ల చాలా డ్యామేజీ జరిగింది. సోలో రిలీజ్ కు గాంధీ గాడ్సే యూనిట్‌ సభ్యులు వెళ్లి ఉంటే ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది అనేది బాలీవుడ్ బాక్సాఫీస్‌ వర్గాల మాట.

గాంధీ హత్యకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించడంతో పాటు ఆ సమయంలో గాంధీ మరియు గాడ్సే యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అనేది దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి అద్భుతంగా తెరకెక్కించారు. గతంలో ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. పదేళ్ల తర్వాత ఈయన హిందీ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తో వచ్చాడు.

ఈ సినిమా కంటెంట్‌ పరంగా పర్వాలేదు అనిపించుకున్నా కూడా రిలీజ్ టైమ్‌ సరైనది కాకపోవడంతో కలెక్షన్స్ దారునంగా ఉన్నాయి. మినిమం కలెక్షన్స్ అయినా పఠాన్ పోటీ లేకుంటే వచ్చేవి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.