Begin typing your search above and press return to search.

గాండీవదారి అర్జున్ కూడా రెడీ.. వచ్చేది ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   7 Jun 2023 6:20 PM GMT
గాండీవదారి అర్జున్ కూడా రెడీ.. వచ్చేది ఎప్పుడంటే?
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో గాండీవదారి అర్జున సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో వరుణ్ తేజ్ కాప్ గా కనిపిస్తున్నాడు. యాక్షన్ బ్యాక్ కథాంశంతో రెడీ అవుతోన్న ఈ మూవీ మెజారిటీ షూటింగ్ యురోపియన్ కంట్రీస్ లోనే జరిగింది. ఇక మూవీకి సంబందించిన కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం కంప్లీట్ చేసారంట.

వరుణ్ తేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మెజారిటీ గా మూవీ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తో ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ కి సంబందించిన యాక్షన్ సీక్వెన్స్ బుడాఫెస్ట్ లో కంప్లీట్ చేశారు. ఈ సన్నివేశాలు సినిమా కి మేజర్ హైలైట్ గా ఉంటాయంట. వరుణ్ తేజ్ గత ఏడాది గని మూవీ తో డిజాస్టర్ ని ఖాతా లో వేసుకున్నాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన ఎఫ్ 3 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు వరుణ్ తేజ్ ఫోకస్ అంతా గాండీవాదారి అర్జున మూవీ పైనే ఉంది. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ కి జోడీ గా ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య నటిస్తోంది. ఇక మిక్కీ జె మియర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పోస్టర్ తో ఈ మూవీ రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.

ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు. మోస్ట్ స్టైలిష్ యాక్షన్ మూవీ గా ఈ సినిమా హాలీవుడ్ చిత్రాల స్టైల్ లో ఉంటుందనే మాట వినిపిస్తోంది. ప్రవీణ్ సత్తారు గత సినిమాలు చూసుకుంటే ఎక్కువగా స్టైలిష్ యాక్షన్ చిత్రాలే చేశారు.

ఆయన నుంచి చివరి గా ది ఘోస్ట్ మూవీ కింగ్ నాగార్జున హీరో గా వచ్చింది. ఈ సినిమా కంటెంట్ బాగున్న కూడా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే మేకింగ్ పరంగా ప్రవీణ్ సత్తారు కి మంచి మార్కులు పడ్డాయి. మరి వరుణ్ తేజ్ కి గాండీవదారి అర్జున సినిమా తో ఏ మేరకు సక్సెస్ ఇస్తాడనేది చూడాలి. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండటం విశేషం.