Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. థమన్ మ్యూజిక్ మళ్లీ కాపీనేనా!

By:  Tupaki Desk   |   27 March 2023 5:00 PM GMT
గేమ్ ఛేంజర్.. థమన్ మ్యూజిక్ మళ్లీ కాపీనేనా!
X
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఇప్పుడు వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీ బిజీగా మారారు. అయితే టాలీవుడ్ ఏ కాదు తమిళ దర్శకులు సైతం ఆయన కోసం  వెంటపడుతున్నారు. ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ ఉంటే చాలు... తమన్ మ్యూజిక్ కోసం వెంపర్లలాడుతున్నారు.

ఈ నేపథ్యంలో  థమన్   కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా తనకు ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు. నిత్యం బిజీగా ఉంటానని తెలిసినా చేతినిండా ప్రాజెక్టులు ఒప్పుకుంటూ వాళ్ళందరిని థమన్ ఇబ్బంది పెడుతున్నాడనే వాదన ఉంది. అయితే  థమన్  ఎక్కువగా కాపీ ట్యూన్స్ చేసి దొరికిపోతూ ఉంటారు.

ఈ విషయం మీద పలు ఇంటర్వ్యూలలో కూడా సందర్భోచితంగా తనను తాను కవర్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. కొత్త కథలు వస్తే కొత్త మ్యూజిక్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కథల ప్రకారమే మ్యూజిక్ అవుతుంది తప్ప తాను వేరేచోట ట్యూన్స్ కాపీ కొట్టి వెళితే తన తల్లి ఇంట్లో తనకు అన్నం పెడుతుందా అంటూ కూడా అప్పట్లో  థమన్  ప్రశ్నించారు.

 ఇప్పుడు ఈ బాధంతా ఎందుకు అంటే ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ 15వ సినిమా గేమ్ ఛేంజర్ టైటిల్ రివిల్ వీడియోకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాపీ ట్యూన్ అని తెలుస్తోంది.

ఒకప్పుడు అంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న తప్పు చేసి దొరికిపోయిన నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.

థమన్ గేమ్ ఛేంజర్కు ఇచ్చిన మ్యూజిక్ కాస్త హిందీ సినిమా అయినటు వంటి అయిషా సినిమాలోని మిట్టి మిట్టి బోల్ సాంగ్ను పోలి ఉంది. దీనితో నెటిజన్లు ఆ రెండింటిని కంపైర్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. ఆ హిందీ సినిమాలోని ట్యూన్ ని మక్కికి మక్కి దించేసి రామ్ చరణ్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా ఇవ్వడంతో థమన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.