గేమ్ చేంజర్.. కనెక్ట్ అవ్వట్లేదా?

Mon Mar 27 2023 13:00:08 GMT+0530 (India Standard Time)

Game Changer.. Not connecting?

గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం RC15. సినిమా ప్రకటించిన నాటి నుంచి ఇదే పేరుతో సంబోధించబడుతూ వచ్చిన ఈ సినిమాకు ఎట్టకేలకు ఒక టైటిల్ ఫిక్స్ చేశారు. నిజానికి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన తాజా మూవీ RC15 మూవీ టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'గేమ్ చేంజర్' అనే టైటిల్‌ను సినిమా యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ టైటిల్ లోగోను తాజాగా చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు సినిమా మేకర్స్. నిజానికి ముందు నుంచే ఈ సినిమాకు CEO అధికారి విశ్వంభర వంటి టైటిల్స్ ముందు నుంచి వినిపించాయి.

దాదాపు గా అయితే చాలా మంది ఈ సినిమాకు CEO అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని ఫిక్స్ అయిపోయారు. సోషల్ మీడియాలోనూ ఈ టైటిల్ ను దాదాపుగా ఖరారు చేసినట్టే ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎవరూ ఊహించని పేరును ఔట్ ఆఫ్ ది బాక్స్ టైటిల్‌ను పట్టుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. పూర్తి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్నఈ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ఎంతవరకు యాప్ట్ అవుతుందనేది రిలీజ్ అయితే కానీ చెప్పలేం.

కానీ ఈ గేమ్ చేంజర్ అనే టైటిల్ ఎందుకో అంత కనెక్టింగ్ గా అనిపించడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. నిజాని కి ఈ సినిమా తెలుగు మాత్రమే కాదు తమిళ మలయాళ హిందీ కన్నడ భాషల్లో కూడా విడుదలవుతుంది. ఈ మధ్య పాన్ ఇండియా మూవీస్ అన్నిటి కీ ఇలా అందరూ కనెక్ట్ అయ్యే ఇంగ్లీష్ పదాలు పెడుతూ ఉండడం కామన్ అయింది.

కానీ ఎందుకో అసలు కనెక్టే మిస్ అయిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక సినిమా మీద అంచనాలు అయితే ఉన్నాయి కానీ ఈ టైటిల్ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.