Begin typing your search above and press return to search.

RRR అన్ క‌ట్ పేరుతో గ్యాంబ్లింగా..?

By:  Tupaki Desk   |   22 May 2022 4:08 AM GMT
RRR అన్ క‌ట్ పేరుతో గ్యాంబ్లింగా..?
X
క్లినిక్ ప్ల‌స్ పేరుతో క్లినిక్ ప‌ల్స్ షాంపూ అమ్మిన‌ట్టు.. కిన్ లే పేరుతో కైన్ లే బాటిల్ అమ్మిన‌ట్టు ఇదేమైనా గ్యాంబ్లింగా? అంటే .. అదేంటో రీడ‌రే చెప్పాల్సి ఉంటుంది. మోస్ట్ అవైటెడ్ 2022 పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ముఖ్యంగా అమెరికాలో బంప‌ర్ హిట్ కొట్టింది. కానీ ఇప్పుడు అక్క‌డ అన్ క‌ట్ వెర్ష‌న్ రీరిలీజ్ అంటూ బోలెడంత హంగామా కనిపిస్తోంది. అన్ కట్ వెర్షన్! అంటే ఏమిటీ..? ఇంత‌కుముందు థియేట‌ర్ల‌లో మ‌నం చూసిన దాని నుండి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? అంటూ నెటిజ‌నుల్లో చ‌ర్చ మొద‌లైంది.

రాజమౌళి- రామారావు- రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ RRR అంత‌ర్జాతీయ‌ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రంలో ఆలియా భ‌ట్- అజ‌య్ దేవ‌గ‌న్ - ఒలీవియా మోరిస్ త‌దిత‌ర తారాగ‌ణం న‌టించారు. ఇప్పుడు RRR అన్ కట్ వెర్షన్ జూన్ 1న అమెరికాలో 100 థియేటర్లలో విడుదల కానుంది. కాబట్టి ఇక్కడ అన్ కట్ వెర్షన్ అంటే ఏంటో అంతా క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది.

అయితే అది వేరు ఇది వేరు కానే కాద‌ట‌! అంతా ఒకటే. మార్చి 25న విడుదలైన RRR ప్లాన్ చేసిన అన్ కట్ వెర్షన్ రెండూ ఒకటేన‌నేది తాజా గుస‌గుస‌. అయితే రెండోది ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ అని పిలుస్తున్నారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌ మూవీ అఫీషియల్‌ ట్విట్టర్‌ హ్యాండిల్ లో జూన్‌ 1న ఈ చిత్రాన్ని అమెరికాలో రీరిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. RRR అన్ కట్ వెర్షన్ థియేట్రికల్ రీ-రిలీజ్ అనేది కేవ‌లం ఒక నైట్ ఈవెంట్ గా ఉంటుంద‌ట‌.

అన్ కట్ వెర్షన్ అంటే మనం చూసిన ఒరిజినల్ మూవీ అని మీనింగ్. హాలీవుడ్ లో ఈ త‌ర‌హా పిలుపు రెగ్యుల్ గా వినిపిస్తుంటుంది. దానినే ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఇప్పుడు తెలివిగా ప్ర‌చారం చేస్తోందంటూ టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ స్పెష‌ల్ షో దేని కోసం అంటే.. ఆంగ్లేయుల వీక్షణ కోసం తదుపరి సవరణలు లేదా కోతలు లేకుండా అనేది అన్ క‌ట్ కి అర్థంగా చెబుతున్నారు. చాలా మంది అన్ కట్ వెర్షన్ అంటే వేరేనా? అని అనుకునేందుకు పొర‌బ‌డేందుకు ఛాన్సుంది. కానీ ఇప్పుడు దీనిపై అంద‌రికీ పూర్తి క్లారిటీ వ‌చ్చిన‌ట్టే. క్లినిక్ ప్ల‌స్ షాంపూకి క్లినిక్ ప‌ల్స్ షాంపూకి మ‌ధ్య ఉన్న తేడా.. కిన్లే బాటిల్ కి కైన్ లీ బాటిల్ కి మ‌ధ్య ఉన్న తేడా తెలుసుకున్న‌ట్టే అనుకోవ‌చ్చు!!