Begin typing your search above and press return to search.

కాబోయే మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్!

By:  Tupaki Desk   |   9 Jun 2023 11:55 AM GMT
కాబోయే మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్!
X
మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్- న‌టి లావ‌ణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక‌టి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్ల ప్రేమ‌కు పెళ్లితో పుల్ స్టాప్ పెడుతున్నారు. ఇరు కుటుంబాలు మ‌ద్ద‌తు తెల‌ప‌డంతోనే వివాహానికి సిద్ద‌మ‌య్యారు. మ‌రికొన్ని గంట‌ల్లో వివాహ తేదీ కూడా బ‌య‌ట‌కు రాబోతుంది. అంగ‌రంగ వైభంగా మెగా వార‌సుడి వివాహం జ‌ర‌గ‌నుంది. వ‌రుణ్ -లావ‌ణ్య తో ప్రేమ‌లో ప‌డ్డాడు అన్న విష‌యం ఈ మ‌ద్య‌నే వెలుగులోకి వ‌చ్చింది.

గ‌తంలో ఇద్ద‌రు క‌లిసి 'మిస్ట‌ర్'..'అంత‌రిక్షం' సినిమాల్లో న‌టించారు. అప్పుడే స్నేహం మొద‌లైంది. అది కాస్త ప్రేమ‌గా మారి పెళ్లి వర‌కూ దారి తీసింది. మ‌రి మెగా వార‌సుడికి కాబోతున్న వ‌ధువు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? త‌ల్లిదండ్రులు ఏం చేస్తారు. తోబుట్టువులు ఎంత‌మంది? లావ‌ణ్య బ‌ర్త్ ప్లేస్ ఎక్క‌డ‌? వంటి వివ‌రాల్లోకి వెళ్తే..

లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగింది. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది. తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసింది. ఆమెకు ఒక చెల్లెలు. ఒక తమ్ముడు ఉన్నారు.

మార్షల్స్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆమె ముంబైకి వెళ్ళి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది. ఆమెకు చిన్నప్పటి నుంచీ గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది.

కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తరువాత మోడలింగ్ లో టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించింది. 2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుంది. ఆ త‌ర్వాత కొన్నాళ్ల పాటు చ‌దువుకొన సాగించింది. 2012లో 'అందాల రాక్ష‌సి' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజ‌యంతో ఆమెకి న‌టిగా మంచి పేరొచ్చింది. 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్'..'సొగ్గాడే చిన్ని నాయ‌నా'.. 'శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు' లాంటి విజ‌యాలు అందుకుంది.

ఇవిగాక చాలా సినిమాలు చేసింది. కానీ అవేవి పెద్ద‌గా హిట్ అవ్వ‌లేదు. కొన్ని లేడీ ఓరియేంటెడ్ ప్ర‌య‌త్నాలు చేసింది. అవి ఆశించిన ఫ‌లితాలివ్వ‌లేదు. కెరీర్ ప్రారంభ‌మై ద‌శాబ్ధం దాటినా లావ‌ణ్య స్టార్ హీరోయిన్ల లీగ్లో మాత్రం చేర‌లేక‌పోయింది. అవ‌కాశాలైతే వ‌చ్చాయి గానీ స్టార్ హీరోయిన్ల స‌ర‌స‌న మాత్రం స్థానం ద‌క్క‌లేదు.