హ్యాట్రిక్ కొట్టాక అనీల్ రావిపూడితో ఫన్ ట్రీట్!

Tue May 04 2021 05:00:01 GMT+0530 (IST)

Fun treat with Anil Ravipudi after hitting a hat trick!

ఇతర స్టార్ హీరోలతో పోటీపడుతూ నటసింహా నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ కథల్ని దర్శకుల్ని ఫైనల్ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటితో అఖండ చిత్రీకరణ పూర్తవుతోంది. మెజారిటీ చిత్రీకరణపై క్లారిటీ వచ్చేయగానే.. తదుపరి అనీల్ రావిపూడితో స్క్రిప్ట్ పరమైన చర్చలు సాగిస్తున్నారు. ఫన్-యాక్షన్- ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కించేందుకు రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. 2022లో ఈ సినిమా రిలీజవుతుంది.బాలయ్య `అఖండ` పూర్తి చేసుకుని అనీల్ కోసం రెడీ అవుతారు. ఈలోగానే వెంకీ-వరుణ్ లతో ఎఫ్ 3 చిత్రీకరణ పూర్తి చేసి అనీల్ రావిపూడి సిద్ధమవుతారు. సెకండ్ వేవ్ వల్ల అఖండ ప్రస్తుతం వాయిదా పడింది. మే12 నుంచి తిరిగి మొదలెట్టే షెడ్యూల్లో ప్రగ్య జైశ్వాల్ బాలయ్యతో చిత్రీకరణకు చేరుతుందట. ఇరువురిపైనా ప్రేమ సన్నివేశాలు మూవీలో హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.

`అఖండ` టీజర్ సాధించిన 50 మిలియన్ల వ్యూస్ టీమ్ లో ఉత్సాహం నింపింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం ప్రధాన అస్సెట్. సింహా- లెజెండ్ తర్వాత బాలయ్య అఖండతో హ్యాట్రిక్ సాధించి అదే హుషారులో అనీల్ రావిపూడితో సెట్స్ కెళతారని అంచనా వేస్తున్నారు.