Begin typing your search above and press return to search.

బాలయ్య ఫ్యాన్ గా సత్యదేవ్...ఫుల్ బాటిల్ అదిరింది..!

By:  Tupaki Desk   |   28 May 2023 11:11 AM GMT
బాలయ్య ఫ్యాన్ గా సత్యదేవ్...ఫుల్ బాటిల్ అదిరింది..!
X
నటుడు సత్యదేవ్ కి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మూవీ లవర్స్ కి ఆయన ఎంచుకునే కథలపై నమ్మకం ఎక్కువ. ఏది పడితే అది చేసేయాలనే ఆత్రం లేకుండా, చాలా సెలక్టివ్ కథలతో ముందుకు దూసుకుపోతూ ఉంటాడు. స్లో పాయిజన్ లాగా సత్యదేవ్ అందరి మైండ్ లోకి ఎక్కేస్తూ ఉన్నాడు. చాలా కాలం సైడ్ యాక్టర్ గా చేసిన ఆయన, ఇప్పుడు తాను కూడా మొయిన్ లీడ్ గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. తాజాగా ఫుల్ బాటిల్ సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

ఫుల్ బాటిల్, మూవీ పేరు చాలా కొత్తగా ఉంది కదా, కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుందని టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఈ టీజర్ ని రౌడీ హీరో విజయ్ దేవర కొండ చేతుల మీద గా విడుదల చేశారు. కాగా, ఈ మూవీలో సత్యదేవ్ బాలయ్య ఫ్యాన్ గా కనిపించనున్నారు.

బాలయ్య ఫ్యాన్..బ్రహ్మ ముహుర్తంలో నే లేస్తాం అంటూ హీరో చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. తమ హీరో కి అభిమానిగా చేస్తున్నాడని, ఈ మూవీ టీజర్ ని బాలయ్య ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు. సత్యదేవ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. మందు కాన్సెప్ట్ తో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.

చార్మి జ్యోతిలక్ష్మి వంటి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్ తో ఆకట్టుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా, విలన్ గానూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ లో విలన్ రోల్ కూడా అద్భుతంగా ప్రదర్శించాడు.

ఇక, ఫుల్ బాటిల్ విషయానికి వస్తే స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జువ్వాజి, ఎస్‌డీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు శరణ్ కథ అందించారు. మూవీ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. 'తిమ్మరుసు' లాంటి డిఫరెంట్ మూవీ తరవాత సత్యదేవ్-శరణ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది.