Begin typing your search above and press return to search.

రాజమౌళితో స్నేహం.. అందుకే RRRలో క్యారెక్టర్

By:  Tupaki Desk   |   14 Jan 2021 11:26 AM GMT
రాజమౌళితో స్నేహం.. అందుకే RRRలో క్యారెక్టర్
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ పీరియడికల్ డ్రామాలో జాతీయ అవార్డు గ్రహీత కోలీవుడ్ నటుడు, నిర్మాత సముద్రఖని నటిస్తున్నారు.

ఆయన రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు సముద్ర ఖని. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’లో తన క్యారెక్టర్ గురించి మాట్లాడారు. తనకు ఆ పాత్ర ఎలా వచ్చిందో వెల్లడించారు.

‘రాజమౌళి గత 11 సంవత్సరాలుగా నాకు మంచి స్నేహితుడు. నాడోడిగల్ (తెలుగులో శంబో శివ శంబో) విడుదలైన తర్వాత రాజమౌళి నాకు మెసేజ్ చేశాడు. నన్ను మెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’‌లో సినిమాలో నాకు ఓ క్యారెక్టర్ లభించింది’ అని చెప్పారు సముద్రఖని.

‘మా 11 ఏళ్ల స్నేహం ఫలితంగా నాకు ఆ సినిమా పాత్ర లభించింది’ అని చెప్పారు సముద్రఖని. తాజాగా ‘క్రాక్’‌ సినిమాలో సముద్రఖని పాత్రకు ప్రశంసలు కురుస్తున్నాయి. చిత్రనిర్మాతగా, బహుముఖ నటుడిగా ఇప్పటికే ప్రశంసలు పొందిన ఆయన.. ‘క్రాక్’ విజయంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.