Begin typing your search above and press return to search.

ప్రేమ‌లో స‌క్సెసై పెళ్లితో ఒక‌ట‌వుతున్న జంట‌ల జాబితాలో!

By:  Tupaki Desk   |   18 Oct 2020 6:50 AM GMT
ప్రేమ‌లో స‌క్సెసై పెళ్లితో ఒక‌ట‌వుతున్న జంట‌ల జాబితాలో!
X
టాలీవుడ్ లో చాలా పెళ్లిల్లు ప్రేమ‌వివాహాలే. తొలుత ఏదో పార్టీలో స్నేహం కుదిరాక ఆ త‌ర్వాత ఆ స్నేహం కాస్తా కాఫీ టేబుల్ వ‌ర‌కూ వెళ్లాక‌.. అటుపై ఒక‌రికొక‌రు మ‌న‌సు విప్పుకుని ల‌వ్ ప్ర‌పోజ్ చేసి ఆన‌క సీక్రెట్ గా కొన్నాళ్ల పాటు ఆ ల‌వ్ లో త‌ల‌మున‌క‌లై ప్రేమైక ర‌సాస్వాధ‌న‌లు చేసి.. చివ‌రికి పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడేయ‌డం అన్న రొటీన్ తెలుగు సినిమా ఫార్ములాటిక్ ల‌వ్ స్టోరీలే ఎక్కువ‌. మ‌న స్టార్ హీరోలు హీరోయిన్ల ప్రేమ‌క‌థ‌లు కూడా ఇంచుమించు ఇలానే ఉన్నాయి.

అయితే ఇటీవ‌లే నిశ్చితార్థం అయిన ఓ జంట ప్రేమ కూడా ఇలానే సాగింద‌ని ఇప్పుడు పెళ్లి బంధంతో `హ్యాపీ ల‌వ్ స్టోరీ కార్డ్` ప‌డుతోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అన్ని ప్రేమ‌క‌థ‌ల్లో లానే ఆ యంగ్ ఇస్మార్ట్ కుర్రాడు స‌ద‌రు ప్రిన్సెస్ కి ప్రేమ‌ను ప్ర‌పోజ్ చేసాడ‌ట‌. ఎంతో వెంట‌పడి చివ‌రికి ప్రేమ ప్ర‌పోజ‌ల్ కి ఓకే చేయించుకుని చివ‌రికి ఇంట్లోనూ ఒప్పించి పెళ్లాడేస్తున్నాడ‌ట‌. ఇరు వ‌ర్గాలు హై ప్రొఫైల్ కాబ‌ట్టి ఈ ప్రేమ‌కు ఆటంకాలేవైనా వ‌చ్చాయా? అంటే అలాంటిదేమీ లేదు. ఆ ఇరు కుటుంబాల సాన్నిహిత్యం స్నేహానుబంధం దృష్ట్యా ఈ జంట ప్రేమ‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌లేద‌ని గుస‌గుస‌గా మాట్లాడుకుంటున్నారు.

త‌న వెంట ప‌డి మ‌రి ప్రేమించ మ‌ని అడిగి మ‌రీ పెళ్లి సెట్ చేసుకున్నాడ‌ట అంద‌గాడైన ఆ స్మార్ట్ బోయ్‌. వీరిద్ద‌రి ల‌వ్ స్టోరీ ఓ చిన్న కామన్ ఫ్రెండ్స్ పార్టీలో మొద‌లైయిందిట‌. ఎప్ప‌టినుంచో త‌న‌ మీద అప‌ర‌మిత‌మైన ప్రేమ ఇష్టంతో చివ‌రికి ప్ర‌పోజ్ చేసి అలా ఆ త‌తంగాన్ని పెళ్లి వ‌ర‌కు తీసుకువ‌చ్చాడన్న‌ది తాజా గుస‌గుస‌. ఏదేమైనా ప్రేమ‌ను స‌క్సెస్ చేసుకుని సంతోష‌మ‌య‌మైన జీవితాన్ని ద‌క్కించుకోగ‌లిగేది కొంద‌రు మాత్ర‌మే. అలాంటి అరుదైన అవ‌కాశం ఈ జంట‌కు క‌లిగిందంటూ ఒక‌టే గుస‌గుస వేడెక్కిస్తోంది.