ప్రఖ్యాత FOX స్టార్ ఇండియా స్టూడియో మూత పడుతోందా?

Sun Oct 18 2020 05:00:05 GMT+0530 (IST)

Is Famous Fox Star India Studio Closing?

కరోనా వైరస్ మార్కెట్లు పరిశ్రమలను ప్రభావితం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చిత్రనిర్మాతలు .. నిర్మాణ సంస్థలు నిలదొక్కుకోలేక ఆపసోపాలు పడుతున్నాయి. ఇవన్నీ కొత్త మార్కెట్లను కోరుకుంటున్నాయి. చిత్ర నిర్మాణం కొనసాగుతున్నా చాలా నిర్మాణ సంస్థలు మూతపడతాయనే పుకార్లు పుష్కలంగా ఉన్నాయి. ఇదివరకూ అమెరికాలో ప్రఖ్యాత ఏఎంసీ థియేటర్ల చైన్ మూసేస్తారని ప్రచారమైంది.తాజా పుకారు ఏమిటంటే... ప్రపంచ విఖ్యాత ఫాక్స్ స్టార్ స్టూడియోస్ పైనా మహమ్మారీ ప్రభావం పడిందని.. బాలీవుడ్ లో చలన చిత్ర నిర్మాణం నుంచి తప్పుకుంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. వాస్తవానికి డిస్నీ అలెయెన్స్ వీడాక.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ మెగా ప్రొడక్షన్ హౌస్ ను సంపాదించుకుందని కరోనావైరస్ మిశ్రమ ప్రభావంతో.. ఫాక్స్ స్టార్ ను ఇప్పుడు మూసివేయాలని నిర్ణయించిందని పుకార్లు వస్తున్నాయి. అయితే ఇవేవీ నమ్మాల్సిన అవసరం లేదని ఒక సోర్స్ చెబుతోంది. ప్రొడక్షన్ హౌస్ మూసివేయడం అనేది కేవలం పుకార్ మాత్రమేనని తెలుస్తోంది.

మూసి వేయరు సరికదా.. అందుకు బదులుగా స్టూడియో మరింత దూకుడుగా మరిన్ని కథలను సృష్టించి బాలీవుడ్ లో సినిమాలు తీయాలని చూస్తోందిట. అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ ను ప్రమోట్ చేయనంత మాత్రాన సినీనిర్మాణం ఆపేస్తున్నట్టు కాదని.. బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ ఉన్న అగ్రశ్రేణి చిత్రనిర్మాతలతో భవిష్యత్ వెంచర్ల కోసం ఫాక్స్ స్టార్ స్టూడియోతో చురుకుగా చర్చలు జరుపుతున్నారని కూడా తెలిసింది. వాస్తవానికి సమీప భవిష్యత్తులో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ చాలా పెద్ద ప్రకటన చేయబోతోందిట. అటువంటి పుకార్లను లైట్ తీసుకుంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఫాక్స్ స్టార్ స్టూడియోస్ స్టార్ స్టడెడ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన `బ్రహ్మాస్త్ర`తో బిజీగా ఉంది. రణబీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించిన మొదటి భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఫ్రాంచైజీలోని మిగతా రెండు భాగాలకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.