అండర్ వాటర్ లో రణ్ బీర్ - వాణీ సయ్యాట!

Thu Jul 07 2022 15:00:01 GMT+0530 (IST)

Fitoor Song Shamshera Ranbir Kapoor Vaani Kapoor

బాలీవుడ్ నుంచి వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా `షంషేరా`. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై పాపులర్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. వాణీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని హిందీ తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. 1800 సంవత్సరం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో బందిపోటు గానూ మరో పాత్రలోనూ రణ్ బీర్ కపూర్ కనిపించబోతున్నారు.ఇటీవల విడుదల చేసిన రణ్ బీర్ కపూర్ లుక్ అతని మేకోవర్ పలువురిని షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ మూవీని కూడా అదే పంథాలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాల్ని పెంచేసింది. గత కొంత కాలంగా సౌత్ లో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ మేకర్స్ ఈ ఈ మూవీని ప్రధాన అస్త్రంగా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

సంజయ్ దత్ బ్యాడ్ మెన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో రోనిత్ రాయ్ అశుతోష్ రాణా సౌరభ్ శుక్లా త్రిధా చౌదరి పితో బాష్ త్రిపాఠి నటించారు. మిథున్ సంగీతం అందించిన ఈ మూవీని జూలై 22న హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయబోతున్నారు. స్వాతంత్య్రం కోసం ఓ బందిపోటు బ్రిటీష్ సామ్రాజ్యంపై ఎలా తిరుగుబాటు చేశాడు.. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నడనే ఆసక్తికరమైన కథతో ఈ మూవీని తెరకెక్కించారు.

తాజాగా విడుదల చేసిన ఈ మూవీలోని విజువల్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. సినిమా రిలీజ్ కి మరో రెండు వారాలు మాత్రమే వున్న నేపథ్యంలో మ్యూజికల్ వీడియోలని విడుదల చేయడం మొదలు పెట్టింది.

ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసిన మేకర్స్ గురువారం సెకండ్ సింగిల్ గా లవ్ సాంగ్ `ఫితూర్` కి సంబంధించిన వీడియోని విడుదల చేసింది. ఇదే సందర్భంగా తెలుగు సాంగ్ ని కూడా రిలీజ్ చేసింది. `నీ పైన పిచ్చి ప్రేమే కదా..` అంటూ చైతన్య ప్రసాద్ రాసిన పాటని విడుదల చేశారు.  

అండర్ వాటర్ లో హీరోయిన్ వాణి కపూర్ రణ్ బీర్ ల రొమాన్స్ వాణీ కపూర్ అందాలు.. ఇద్దరి మధ్య జరిగే లిప్ లాక్  ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లవ్ లీ రొమాంటిక్ సాంగ్ గా ఈ పాటని అండర్ వాటర్ లో ఎక్కువ భాగం చిత్రీకరించారు. ఈ విజువల్స్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా వున్నాయి. జూలై 22న విడుదల కానున్న ఈ మూవీ ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ని ఆడియన్స్ కి అందింస్తుందో వేచి చూడాల్సిందే.