స్వాతిముత్యం ఫస్ట్ సింగిల్...కెమిస్ట్రీ అదిరింది

Mon Jun 27 2022 17:16:25 GMT+0530 (India Standard Time)

First Single from Swathi Muthyam Nee Chaaredu Kalle Unveiled

స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ మూవీ `స్వాతిముత్యం`. వర్ష బొల్లమ్మ హీరోయిన్. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ద్వారా  లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ మూవీ టీజర్ ని మేకర్స్ విడుదల చేశారు. టీజర్ వెరైటీగా వుండటంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది.



సినిమా రిలీజ్ కు రెడీ కావడంతో చిత్ర బృందం తాజాగా ప్రమోషన్స్ ని ప్రారంభించారు. టైటిల్ ప్రకటించిన దగ్గరి నుంచి టీజర్ రిలీజ్ వరకు ఈ మూవీపై చాలా వరకు పాజిటివ్ బజ్ నడుస్తోంది. పైగా బెల్లంకొండ గణేష్ తొలి మూవీనే ఇలా విభిన్నమైన కథని ఎంచుకోవడం పలువురిని ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా కొత్త తరహా కథలకే తన ప్రాథాన్యత అంటూ తొలి చిత్రంతోనే గణేష్ క్లారిటీగా వస్తున్నాడని ఇలా చేస్తే హీరోగా లాంగ్ రన్ లో వుండాలని కూడా కామెంట్ లు మొదలయ్యాయి.

ఇదిలా వుంటే ఈ మూవీ ప్రమోషన్స్ ని ప్రారంభించిన మేకర్స్ తాజాగా సోమవారం ఫస్ట్ సింగిల్ `నీ చారెడు కళ్లే.. ` అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేసింది. మహతి స్వరసాగర్ స్వరాలు అందించగా కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అర్మాన్ మాలిక్ సంజనా కల్మాంజే ఆలపించిన పూర్తి సాంగ్ ని తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో బెల్లంకొండ గణేష్ వర్ష బొల్లమబ్మల మధ్య కుదిరిన కెమిస్ట్రీ అదిరింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ ప్రధాన హైలైట్ గా నిలవబోతోంది.

రొటీన్ లవ్ స్టోరీలకు కాస్త భిన్నంగా సున్నితమైన భావోద్వేగాలని ప్రేమకథకు జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీని ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మహతి స్వరసాగర్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలవనున్నఈ మూవీలో రావు రమేష్ సుబ్బరాజువెన్నెల కిషోర్ సప్తగిరి హర్షవర్థన్ పమ్మిసాయి గోపరాజు రమణ శివనారాయణ సురేఖా వాణి సునైనా దివ్యశ్రీపాద తదితరులు నటిస్తున్నారు.