ఫొటో స్టోరీ : మాస్ స్టెప్పులతో మాస్ రాజా -శ్రీలీల జింతాక్ రచ్చ!

Mon Aug 15 2022 21:00:01 GMT+0530 (IST)

First Single Arriving From Mass Maharaj Dhamaka

మాస్ మహారాజా రవితేజ ఇటీవల `రామారావు ఆన్ డ్యూటీ` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందిలేకపోయింది. దీంతో రవితేజ తన తదుపరి చిత్రాలపై పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `వాల్తేరు వీరయ్య`లోనూ ఓ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.ఇక హీరోగా సుధీర్ వర్మ రూపొందిస్తున్న `రావణాసుర` వంశీ తెరకెక్కిస్తున్న `టైగర్ నాగేశ్వరరావు` సినిమాలు చేస్తున్నారు. మూడవది త్రినాథరావు నక్కినతో కలిసి పక్కా కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా చేస్తున్న మూవీ `ధమాకా`. `డబుల్ ఇంపాక్ట్` అని ట్యాగ్ లైన్.

`పెళ్లిసందD` ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

దీనికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. `బెంగాల్ టైగర్` మూవీ తరువాత రవితేజ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్న రెండవ సినిమా ఇది. సినిమా రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా ముందుగా లిరికల్ వీడియోలని రిలీజ్ చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలో ని `జింతాక్..` అంటూ సాగే మాస్ బీట్ లిరికల్ వీడియోని విడుదల చేయబోతున్నారు.

ఆగస్టు 18న మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ పాటకు సంబంధించిన లిరికలల్ వీడియోని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవాం విడుదల చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ పై సంప్రదాయ దుస్తుల్లో వున్న మాస్ మహారాజా రవితేజ హీరోయిన్ శ్రీలీలని ఎత్తుకుని ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్న తీరు మాస్ కు పూనకాలు తెప్పించేలా వుంది. రవితేజ మాస్ స్పీడుకి శ్రీలీల కూడా అంతే జోరుతో జింతాక్ అంటూ అదిరిపోయే మాస్ స్టెప్పులతో రెచ్చి పోయినట్టుగా కనిపిస్తోంది.  

చిరాగ్ జైన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీకి కథ మాటలు  ప్రసన్న కుమార్ బెజవాడ - సంగీతం బీమ్స్ సిసిరోలియో - సినిమాటోగ్రఫీ కార్తీక్ ఘట్టమనేని - ఫైట్స్ రామ్ లక్ష్మణ్.