Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: స్టైలిష్ లుక్ లో గేమ్ చేంజర్

By:  Tupaki Desk   |   27 March 2023 4:08 PM GMT
ఫస్ట్ లుక్: స్టైలిష్ లుక్ లో గేమ్ చేంజర్
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రాజమౌళి తర్వాత సౌత్ లో టాప్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కావడంతో మరింతగా ఈ సినిమాపై హైప్ ఉంది.

ఇక దిల్ రాజు ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తాజాగా ఈ మూవీ టైటిల్ ప్రోమోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ టైటిల్ ప్రోమోని చాలా క్రియేటివ్ గా శంకర్ డిజైన్ చేయించి రిలీజ్ చేశారు. ఈ టైటిల్ టీజర్ యుట్యూబ్ లో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇక ఫ్యాన్స్ అదే మూడ్ లో ఉండగానే శంకర్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ చరణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా గడ్డంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. బైక్ పై కూర్చొని వెనక్కి చూస్తూ ఉన్న ఈ లుక్ లో మాస్ ఆడియన్స్ భాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.

ముఖ్యంగా ఈ లుక్ లో రామ్ చరణ్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. కాలేజీ రోజుల్లో రెబల్ గా తిరిగే కుర్రాడి తరహాలో ఈ క్యారెక్టర్ లుక్ ఉండటం ఉండటం విశేషం. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.

రామ్ చరణ్ ని కెరియర్ ఆరంభంలో చిరుతలో ఈ రకమైన ఫుల్ హెయిర్ స్టైల్ లో ఆడియన్స్ చూశారు. మరల ఇప్పుడు గేమ్ చేంజర్ లో అలాంటి హెయిర్ స్టైల్ లో కనిపిస్తూ ఉండటం విశేషం.

మొత్తానికి ఒక్క టైటిల్ ప్రోమో, ఫస్ట్ లుక్ తో గేమ్ చేంజర్ మూవీ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. దీంతో సినిమా మీద కూడా అంచనాలు పెరిగిపోయాయి. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ ఉండబోతుంది అని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. మరి ఈ సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో ఎన్ని'సంచలనాలు క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.