ఫస్ట్ లుక్: 'దొంగ' ఎవరో ?

Fri Nov 15 2019 20:18:21 GMT+0530 (IST)

First Look: Who is the "thief"?

యుగానికొక్కడు-ఆవారా- ఖాకీ-ఖైదీ .. ఇవన్నీ కార్తీ కెరీర్ బెస్ట్ గా నిలిచాయి. కంటెంట్ పరంగా చూస్తే.. ఒక దానితో ఒకటి గా సంబంధం లేని కథల తో వచ్చి విజయాలు అందుకున్నాయి. ఇటీవల కొన్ని పరాజయాల తర్వాత ఖైదీ చిత్రం సాధించిన విజయం కార్తీ కి పెద్ద ఊరట ను ఇచ్చింది. కంటెంట్ తో కంబ్యాక్ అవ్వడం ఎలానో ప్రాక్టికల్ గానే చూపించాడు కార్తీ. ఖైదీ చిత్రంతో కెరీర్ తొలి 100 కోట్ల క్లబ్ అందుకున్నాడు.అందుకే తదుపరి అతడు నటిస్తున్న సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ సినిమా టైటిల్ దొంగ. ఇందులో కార్తీ తో పాటు గా తన వదిన గారైన జ్యోతిక ఓ కీలక పాత్ర ను పోషిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఝాన్సీ- జాక్‌పాట్ లాంటి సినిమా ల సక్సెస్ తో జ్యోతిక జోరు గురించి తెలిసిందే.  లేడీ ఓరియెంటెడ్ సినిమాల తో తన జోరు ఏమాత్రం తగ్గ లేదని జ్యోతిక నిరూపించారు. అందుకే ఈసారి వదిన- మరిది కలిసి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

తాజాగా రిలీజైన `దొంగ` ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇది దొంగా పోలీస్ సినిమా అని అర్థమవుతోంది. ఇందు లో దొంగ ఎవరు?  పోలీస్ ఎవరు? అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఈ చిత్రాన్ని తెలుగు-తమిళంలో విడుదల చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జీతు జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వయాకామ్ 18 స్టూడియోస్ తో కలిసి సూరజ్ సధనా ఈ మూవీని నిర్మిస్తున్నారు.