Begin typing your search above and press return to search.
'హరి హర వీరమల్లు' సెట్స్ లో అగ్ని ప్రమాదం
By: Tupaki Desk | 29 May 2023 9:13 AMసెట్స్ లో అగ్నిప్రమాదాలు తరచుగా సినిమా షూటింగులకు పెను విఘాతంగా మారుతున్నాయి. గతంలో చిరంజీవి- సైరా.. ప్రభాస్ - ఆదిపురుష్.. సెట్స్ దహనమవ్వగా ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లోను భారీ సెట్ దగ్ధం ఘటనను ఇంకా ఎవరూ మరువలేదు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో అర్థరాత్రి సమయంలో మంటలు ఎగసిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల వర్షానికి కూలిన సెట్ కి మరమ్మత్తు చేస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేశారు.
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లు చిత్రీకరణ అంతకంతకు ఆలస్యమవుతోంది. పవన్ ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు రెండిటినీ సమాంతరంగా నడిపిస్తుండడంతో కాల్షీట్ల సమస్య తలెత్తుతోందన్న కథనాలొచ్చాయి.
అయినా క్రిష్ ఎంతో ప్రణాళికా బద్ధంగా ఈ సినిమాని పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు సెట్స్ రిపేర్ సమయంలో అగ్ని ప్రమాదం కొంత ఇబ్బందికరం. తిరిగి సెట్ నిర్మించి పెండింగ్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది.
కోహినూర్ వజ్రం దొంగతనం... నెమలి సింహాసనం తరలింపు సహా పలు చారిత్రక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఇది తొలి పాన్ ఇండియన్ మూవీ కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపిస్తారు. అతడి స్నేహితుడు ఏం.ఎం.రత్నం రాజీ అన్నదే లేకుండా ఈ సినిమాకి బడ్జెట్ సమకూరుస్తున్నారు.
దాదాపు 150కోట్ల వరకూ పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే పవన్ క్రేజ్ తో పెట్టుబడి మొత్తం రిలీజ్ కి ముందే వెనక్కి వస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. నాటునాటుతో ఆస్కార్ ని అందించిన ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి బాణీలు కడుతున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆస్కారం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.