Begin typing your search above and press return to search.

బ్యాన్ ఎఫెక్ట్.. కాంట్రవర్సీ కారణంగా విడుదల కానీ సినిమాలివే.!

By:  Tupaki Desk   |   7 Jun 2023 8:00 AM GMT
బ్యాన్ ఎఫెక్ట్.. కాంట్రవర్సీ కారణంగా విడుదల కానీ సినిమాలివే.!
X
ప్రతి డైరెక్టర్ తన సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాడు. తన సినిమాతో జనాలకు చేరువ అవ్వాలని తాపత్రయపడతారు. కేవలం దర్శకుడే కాదు, అందులో నటిచిన నటులు కూడా అదే కోరుకుంటారు. ఇక నిర్మాతలైతే తమ ఆస్తులన్నీ ఖర్చు చేసి మరీ సినిమా కోసం పెడుతూ ఉంటారు. అలా అంత కష్డపడి తీసిన సినిమా విడుదల కాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో వారికి మాత్రమే తెలుస్తోంది.

అంత కష్టపడిన సినిమాని ఏదో ఒక కారణం చెప్పి, విడుదల కాకుండా ఆపితే ఎంత బాధగా ఉంటుంది. కేవలం మూవీ ట్రైలర్, టీజర్ చేసి వాటిలో అభ్యంతకర కంటెంట్ ఉందని చెప్పి విడుదల చేయకుండా బ్యాన్ చేశారు.

ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ అయిన కేరళ స్టోరీ సినిమాని కూడా అంతే బ్యాన్ చేయాలని అనుకున్నారు. కానీ, ఆ మూవీ అన్ని అడ్డంకులను తట్టుకొని విడుదలైంది. కానీ, విడుదల నోచుకొని చాలా సినిమాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

ఉర్ఫ్.. ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా బ్యాన్ చేశారు. అప్పట్లో ఈ వార్త తీవ్ర సంచనలం సృష్టించింది. అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ సినిమాని అప్పట్లో విడుదల కాకుండా ఆపేశారు. మరో సినిమా సిన్స్ కూడా విడుదల కాలేదు. ఆ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో అప్పట్లో ఈ మూవీ ని విడుల చేయడానికి అంగీకరించలేదు.

ఈరోజుల్లో లెస్బియన్ కథలు మామూలు అయిపోయి కానీ, ఇలాంటి కథతోనే ఒకప్పుడు పింక్ మిర్రర్ పేరిట సినిమా తీశారు. ఈ సినిమా కారణంగా యువత తప్పుదోవ పడతారనే కారణంతో ఈ సినిమాని విడుదల కానివ్వలేదు. అసభ్య సన్నివేశాలు ఉన్నాయని పరంజియా కూడా విడుదల అడ్డుకున్నారు.

ఈరోజుల్లో పాన్ ఇండియా సినిమాలు కామన్ అయిపోయాయి.కానీ ఒకప్పుడు కమల్ హాసన్, షారూఖ్ వంటి స్టార్స్ కలిసి హే రామ్ అనే సినిమాని చిత్రీకరించారు. కానీ, ఈ సినిమాను తెరెకు ఎక్కనివ్వలేదు. మూవీ విడుదలను అడ్డుకోవడంతో, మేకర్స్ విడుదల చేయకుండా ఆపేశారు. ఒకవేళ ఇవి విడుదల అయ్యి ఉంటే ఎలా ఉండేదో.