Begin typing your search above and press return to search.

సినిమా నిర్మాణం వ్యాపారమే.. మెగా బ్రదర్‌ కామెంట్స్ వైరల్‌

By:  Tupaki Desk   |   7 Feb 2023 1:00 PM GMT
సినిమా నిర్మాణం వ్యాపారమే.. మెగా బ్రదర్‌ కామెంట్స్ వైరల్‌
X
సినిమా అనేది ఈ మధ్య కాలంలో పూర్తిగా వ్యాపార ధోరణి గా మారిందని మెగా బ్రదర్‌ నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా నిర్మాణం విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై నాగబాబు స్పందిస్తూ కమర్షియల్‌ గా సక్సెస్ ను దక్కించుకోవడం కోసమే ప్రతి ఒక్కరు సినిమాలను నిర్మిస్తున్నారని పేర్కొన్నాడు.

ఈ మధ్య కాలంలో నాగబాబు ఏ వ్యాఖ్యలు చేసినా కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తమ్ముడు జనసేన పార్టీలో క్రియాశీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న నాగబాబు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి కాని.. మోజు కాని లేదు అంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నాగబాబు తాజాగా మరో ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలోని హింస మరియు ఇతర విషయాల గురించి కొందరు చేస్తున్న విమర్శలపై నాగబాబు స్పందించాడు.

వారు సినిమా ఇండస్ట్రీకి ఒక సెన్సార్‌ బోర్డు అనేది ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నాడు. సెన్సార్‌ బోర్డు సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటుంది. కనుక వివాదాస్పద విషయాలను సెన్సార్‌ బోర్డు ముందుగానే చూసుకుంటుంది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సినిమా అనేది వ్యాపార ధోరణి తో తీస్తున్నది కనుక విలువలు ఉండాల్సిన అవసరం లేదు అంటూ నాగబాబు వ్యాఖ్యలకు చాలా మంది సమర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.