హన్సిక సింగిల్ షాట్.. సింగిల్ క్యారెక్టర్

Thu Jul 22 2021 08:00:01 GMT+0530 (IST)

Film is being made experimentally with a single character in a single shot

ఇండియన్ సినీ చరిత్రలో కని విని ఎరుగని సినిమా ఒకటి ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. హన్సిక హీరోయిన్ గా రాజు దుస్స దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 105 మినిట్స్. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఒక విల్లాలో జరుగుతోంది. ఈ సినిమా ప్రయోగాత్మకంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో రూపొందుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ సినిమా తరహాలో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై సినిమా రాలేదని.. హన్సిక ఈ ప్రయోగాత్మక సినిమాకు ఓకే చెప్పడం అభినందనీయం అంటున్నారు.ఈ సినిమా గురించి హన్సిక ట్విట్టర్ లో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ అంది. ఈ సినిమా షూటింగ్ ను కంటిన్యూస్ గా చేస్తారట. ఎడిటింగ్ అనేది లేకుండా సింగిల్ షాట్ లోనే సినిమాను పూర్తి చేస్తామని చెబుతున్నారు. సింగిల్ షాట్ లో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి.. తక్కువ సమయంలో షూటింగ్ చేసిన సినిమాలు కొన్ని వచ్చాయి. కాని ఈ సినిమా అన్నింటికి ప్రత్యేకం అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

షూటింగ్ స్పాట్ లో ఎడిటర్ పర్యవేక్షిస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఎడిటింగ్ చేయడం లేదని పేర్కొన్నారు. రుద్రాన్స్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమా విభిన్నంగా ఉంటుందని.. ఇదో ప్రయోగాత్మక సినిమా గా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఒకే ఒక్క పాత్ర.. సింగిల్ టేక్.. నో ఎడిటింగ్.. ఇలా కూడా సినిమా తీస్తారా.. చేస్తారా అన్నట్లుగా నెటిజన్స్ నుండి ఇంట్రెస్ట్ వ్యక్తం అవుతోంది.

TAGS: