టాప్ స్టోరి: పెళ్లయినా హనీమూన్ మిస్సయిన జంటలు

Wed Jan 25 2023 05:00:01 GMT+0530 (India Standard Time)

Film Actors Who Missed Honeymoon

ఘనమైన పెళ్లి ఆ తర్వాత మూడోరోజు శోభనం .. ఈ రెండిటి గురించి కలలు కనని యువత ఎవరుంటారు? ఉన్నారు అంటే అది సందేహమే!! నేటితరం ప్రేమలు పెళ్లిళ్లు డేటింగులు ఔటింగులు జరంత స్పీడ్ గానే కానిచ్చేస్తున్నారు. కానీ ఇంట్లో అనుమతులు తీసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న ఈతరం ట్రెండీ సెలబ్రిటీ కపుల్స్ కాపురం ఆరంభమయ్యే తీరు గమనిస్తే అయ్యో! అనకుండా ఉండలేం.ఒకప్పటిలా ఇవి ఖాళీ రోజులు కావు. నిరంతరం డబ్బు వేటలో మునిగి తీరిక లేని షెడ్యూళ్లతో లైఫ్ ప్యాకప్ అయిపోయి వ్యక్తిగత జీవితంలో రొమాన్స్ తో పాటు చాలా సరిగమల్ని మిస్సవ్వాల్సొస్తోంది. దీనిని పోస్ట్ పోన్ అని పిలిచినా లేక ఇంకేదైనా పేరుతో పిలిచినా ఆ అరుదైన అందమైన క్షణాలను మిస్ చేసుకుంటున్నట్టే. ఈ కోణంలో పరిశీలిస్తే ఇటీవల పెళ్లితో ఒకటైన చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ సన్నివేశం ఇలానే ఉంది. అతియా శెట్టి - KL రాహుల్ ఈ ఏడాది (2023) జనవరి 23న వివాహం చేసుకున్నారు. అయితే ఈ సెలబ్రిటీ జంట హనీమూన్ కు వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికే ముందస్తు కమిట్ మెంట్ లు ఉన్నందున ఆ ఇరువురూ హనీమూన్ ని దాటవేసారు. తాజా కథనాల ప్రకారం.. ఈ జంట హనీమూన్ కి వెళ్లడానికి కొంత సమయం వేచి ఉండాల్సిందేనని తెలిసింది. రాహుల్ తదుపరి టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియాతో చేరాలని భావిస్తున్నారు. అలాగే అథియా తన తాజా సినిమాను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.

రణబీర్ కపూర్ - అలియా భట్ జంట పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ 14 ఏప్రిల్ 2022 న పెళ్లితో ఒకటయ్యారు. సింపుల్ వెడ్డింగ్ తర్వాత రణబీర్ సందీప్ వంగాతో 'యానిమల్' ఫిల్మ్ సెట్స్ పైకి తిరిగి వెళ్లాడు. అలియా ముంబై నగరం నుండి బయలుదేరి సౌతాఫ్రికాకు వెళ్లారు. చాలా గ్యాప్ తర్వాత ఇద్దరూ కలిసి 2022 న్యూ ఇయర్ వేడుకలను సౌత్ ఆఫ్రికాలో సెలబ్రేట్ చేసుకున్నారు. హనీమూన్ ఆలస్యమైంది.

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తన చిన్ననాటి స్నేహితురాలు.. ప్రేమికురాలు నటాషా దలాల్ ను వివాహం చేసుకున్నాడు. 24 జనవరి 2021న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి తర్వాత వరుణ్ 'భేదియా' షూటింగ్  ను ప్రారంభించాడు. అయితే దీనికోసం హనీమూన్ ను వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత వరుణ్ తన భార్యను అరుణాచల్ ప్రదేశ్ లో బోటు షికారు చేసేందుకు తీసుకెళ్లాడు. భార్యాసుతుడికి తన వైఫ్ కి సమయం కేటాయించేందుకు చాలా చిక్కులు ఎదురయ్యాయంటే దానికి కారణం బిజీ లైఫ్

బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు తన చిరకాల స్నేహితురాలు పత్రలేఖను 2021 నవంబర్ 15న వారి సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. షూటింగ్ కమిట్ మెంట్ లు ఉన్నందున ఈ జంట తమ పెళ్లి తర్వాత తిరిగి ఎవరి పనిలోకి వారు వెళ్లారు. తర్వాత ఇద్దరూ పారిస్ కి వెళ్లి హనీమూన్ ఎంజాయ్ చేసారు. అప్పట్లో ఈ జంట ఈఫిల్ టవర్ ముందు పోజులిచ్చిన ఫోటో వైరల్ అయింది.

విక్రాంత్ మాస్సే - శీతల్ ఠాకూర్ జంట 12 ఫిబ్రవరి  2022న పెళ్లితో ఒకటయ్యారు. అందాల నాయిక శీతల్  హనీమూన్ కోసం భర్తతో బయలుదేరాలనుకుంది. కానీ విక్రాంత్ కి క్షణం తీరికలేని కఠినమైన షెడ్యూల్ ఉండడంతో అది సాధ్యం కాలేదు. పెళ్లికి 4 రోజుల ముందు విక్రాంత్ సెట్స్ పైకి వెళ్లాడు.

ఫర్హాన్ అక్తర్ - షిబానీ దండేకర్ 19 ఫిబ్రవరి 2022న వివాహం చేసుకున్నారు. బిజీ లైఫ్ వల్ల ఈ జంట హనీమూన్ ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఫర్హాన్ షూటింగుల బిజీ వల్ల లవ్ కపుల్ శృంగారభరితమైన మనోహరమైన విహారయాత్రకు వెళ్లేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదని ఫర్హాన్ తల్లి హనీ ఇరానీ వెల్లడించారు. తరువాత ఇద్దరూ 2023కి స్వాగతం పలికేందుకు గోవాకు జంపయ్యారు. ఈ వెకేషన్ నుండి ఆవిరులు పుట్టించే వరుస ఫోటోలను ఈ జంట షేర్ చేసారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.