Begin typing your search above and press return to search.

బాలయ్య 'బర్త్ డే ట్రీట్'లో ఫ్యాన్స్ పస లేదంటున్నారా..??

By:  Tupaki Desk   |   11 Jun 2021 4:30 AM GMT
బాలయ్య బర్త్ డే ట్రీట్లో ఫ్యాన్స్ పస లేదంటున్నారా..??
X
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును ఈరోజు నందమూరి అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ బాగా నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఫస్ట్ మూవీ పటాస్ నుండి మొదలుకొని గతేడాది సరిలేరు నీకెవ్వరూ వరకు వరుసహిట్లతో దర్శకుడుగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్ 'బాలయ్య - అనిల్ రావిపూడి'. మొన్నటివరకు ఈ కాంబో పై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసాయి.

అలాగే ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయింది కావచ్చు. బాలయ్య పుట్టినరోజున అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని ఎక్సపెక్ట్ చేశారు. తీరా బాలయ్య బర్త్ డే వచ్చింది. కానీ ఇంతవరకు అనిల్ రావిపూడితో సినిమా గురించి ఎలాంటి ఊసు లేదు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో టాక్ వినిపించడం లేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అనిల్ తదుపరి సినిమాను నటసింహం బాలయ్యతో తీయాలనే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కొన్నేళ్లుగా బాలయ్యతో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంతవరకు బాలయ్య నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదట. అయితే ఇటీవలే అనిల్ కథకు బాలయ్య ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో టాక్ స్ప్రెడ్ అయింది.

కానీ బర్త్ డే రోజు ఆశించిన అనౌన్స్ మెంట్ రాకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారట. ఎక్సపెక్ట్ చేసిన అనిల్ కాకుండా బోయపాటి అఖండ నుండి పోస్టర్.. తదుపరి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న 107వ సినిమా అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఓకే అవి ఆల్రెడీ తెలిసినవే కాబట్టి పెద్దగా థ్రిల్ అవ్వలేదట. కానీ అసలు 108వ సినిమా గురించి చర్చ మొదలైంది. అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు. మరి ఇంతకీ ఏం జరిగి ఉంటుందని ఫ్యాన్స్ లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాతో పాటు గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. అనిల్ ఎఫ్3 మూవీ చేస్తున్నాడు. చూడాలి మరి త్వరలో అయినా ఈ కాంబినేషన్ తీపికబురు చెబుతుందేమో!