Begin typing your search above and press return to search.

బాలయ్య స్ట్రాంగ్‌ లైనప్‌ పై ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ

By:  Tupaki Desk   |   16 May 2022 11:30 AM GMT
బాలయ్య స్ట్రాంగ్‌ లైనప్‌ పై ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ
X
నందమూరి బాలకృష్ణ చాలా గ్యాప్ తర్వాత అఖండ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. బాలయ్య ఆ సక్సెస్‌ జోరును కంటిన్యూ చేయాలంటూ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసే విధంగానే ఆయన సినిమాల ఎంపిక ఉందని.. ఆయన అప్‌ కమింగ్‌ సినిమాల లైనప్ ఉందనే నమ్మకంను నందమూరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. క్రాస్‌ తో పాటు పలు మాస్‌ సక్సెస్ లను దక్కించుకున్న గోపీచంద్‌ మలినేని ప్రస్తుతం బాలయ్య తో చేస్తున్న సినిమాపై చాలా పాజిటివ్‌ గా చర్చ జరుగుతోంది. సినిమాకు పాజిటివ్‌ బజ్ ఉన్న నేపథ్యంలో తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

గోపీచంద్‌ మలినేని సినిమా తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమా కూడా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు అపజయం ఎరగని దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తదుపరి సినిమా ఉండబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. బాలయ్య ఈ రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

ఈ రెండు కూడా ఖచ్చితంగా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఆడుతాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే వరుసగా మూడు సినిమాలను సక్సెస్ చేసుకున్న సీనియర్‌ హీరోల్లో బాలయ్య చాలా స్పెషల్‌ గా నిలుస్తాడు. బాలయ్య మరిన్ని సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అవన్నీ కూడా అభిమానులకు కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.

ప్రస్తుతం చేస్తున్న గోపీచంద్‌ మలినేని సినిమా పూర్తి అవ్వక ముందే అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను బాలయ్య మొదలు పెట్టబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తాడట.

సింహా.. లెజెండ్‌ మరియు అఖండ సినిమాలతో సూపర్‌ హిట్‌ అందుకున్న బాలయ్య.. బోయపాటిల కాంబోలో మరో సినిమా అంటే ఖచ్చితంగా నందమూరి అభిమానులకు పండుగే. బాలయ్య మూడు సినిమాలు కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కనుక ఈ స్ట్రాంగ్‌ లైనప్‌ తో బాలయ్య విజయాలు దక్కించుకోవడం ఖాయం అంటూ టాక్‌ వినిపిస్తుంది.