Begin typing your search above and press return to search.

తొడకొట్టాడోయ్ తెలుగోడు.. పవన్ వీరమల్లు లుక్ పై ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!

By:  Tupaki Desk   |   7 Dec 2022 9:30 AM GMT
తొడకొట్టాడోయ్ తెలుగోడు.. పవన్ వీరమల్లు లుక్ పై ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!
X
తన ప్రతి సినిమాతో ట్రెండ్ సెట్ చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. పవన్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ చారిత్రక కథతో వస్తున్నాడు. సినిమాలో పవన్ ఒక గజ దొంగ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు మూవీ పై భారీ అంచనాలు ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా పవన్ వీరమల్లు లుక్ తో మరోసారి సర్ ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. సెట్స్ లో ఉండగా పవన్ వీరమల్లు స్టిల్ ఒకటి బయటకు లీక్ అయ్యింది.

రెడ్ కలర్ డ్రెస్ లో లైట్ గడ్డంతో పవర్ స్టార్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాతో పవన్ రేంజ్ పాన్ ఇండియా లెవల్లో తెలిసేలా చేస్తున్నాడు క్రిష్. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ అనుకున్న విధంగా స్పీడ్ గా జరగకపోయినా పవన్ ఈ లుక్ చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సూపర్ హ్యాపీగా ఉన్నారు.

సినిమా లేట్ అయినా పర్లేదు కానీ మా హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందించు చాలు అంటూ క్రిష్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ మెసేజ్ లు చేస్తున్నారు. క్రిష్ సినిమా అంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా మినిమం గ్యారెంటీ హిట్ అన్నట్టు ఉంటుంది.

ఇక అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ కాబట్టి యావరేజ్ గా ఉన్నా ఫ్యాన్స్ హిట్ చేస్తారు. వీరమల్లు మూవీ పవర్ స్టార్ కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమా.. ఇలాంటి పాత్రల్లో పవన్ ని ఎప్పుడూ కూడా ఫ్యాన్స్ చూడలేదు. ఈమధ్యనే వచ్చిన టీజర్ లో తొడకొట్టాడోయ్ తెలుగోడు అంటూ ఫస్ట్ టైం పవన్ చేత కూడా తొడకొట్టించి గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు క్రిష్. సినిమాలో అలాంటి సీన్స్ ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ షెడ్యూల్ తో దాదాపు మేజర్ పార్ట్ అంతా పూర్తి అవుతుందట.

అసలైతే 2023 సంక్రాంతికి రిలీజ్ అనుకున్న హరి హర వీరమల్లు మూవీ పొంగల్ రేసు నుంచి డ్రాప్ అయ్యి సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. అయితే సమ్మర్ కైనా సినిమా వస్తుందా లేదా అన్నది చూడాలి. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న వీరమల్లు సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.