Begin typing your search above and press return to search.

మా హీరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?

By:  Tupaki Desk   |   5 Dec 2020 3:30 PM GMT
మా హీరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?
X
టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'రాధే శ్యామ్' కాకుండా 'ఆదిపురుష్' 'సలార్' మరియు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా పూర్తైన తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో ఓ మూవీ చేయనున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో అర డజను సినిమాలు ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ప్రశాంత్ నీల్ లతో కలవనున్నాడు. అల్లు అర్జున్ 'పుష్ప' ని సెట్స్ పై ఉండగానే కొరటాల శివతో ఓ మూవీ ప్రకటించేశాడు. సూపర్ సీనియర్ హీరోలు సైతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ మాత్రం తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వడం లేదు. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపిస్తున్నాడు.

అయితే 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత చరణ్ నటించే సినిమాపై స్పష్టత రావట్లేదు. హోమ్ ప్రొడక్షన్ లో చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో నటించనున్నప్పటికీ అది అతిథి పాత్ర మాత్రమే. ఒకవైపు స్టార్ హీరోలందరూ కొత్త స్క్రిప్ట్స్ వింటూ న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంటే చరణ్ మాత్రం సైలెంటుగా ఉంటున్నాడని చెర్రీ అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వెంకీ కుడుముల దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయనున్నాడనే న్యూస్ ఆ మధ్య చక్కర్లు కొట్టింది. అలానే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగాతో అని.. ఓ డెబ్యూ డైరెక్టర్ చెప్పిన స్టోరీ లైన్ కి చరణ్ ఇంప్రెస్ అయ్యాడని రూమర్స్ వచ్చాయి. అలానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చరణ్ తదుపరి సినిమా ఉంటుందని టాక్ నడిచింది. అయితే ఇంతవరకు ఒక్క సినిమాపై కూడా క్లారిటీ రాలేదు. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ని ఖుషీ చేసే న్యూస్ త్వరలోనే వస్తుందేమో చూడాలి.