Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల నిర్ణయంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్..?

By:  Tupaki Desk   |   8 July 2022 1:30 AM GMT
స్టార్ హీరోల నిర్ణయంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్..?
X
టాలీవుడ్ బిగ్ స్టార్ ఒకరు ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారు. యంగ్ హీరోలతో పోటీగా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు.

ఇప్పటికే మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మరో మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల మరో ప్రాజెక్ట్ కు కమిట్ మెంట్ ఇచ్చాడు. ఓ సినిమా ఫంక్షన్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే ఈ మూవీపై హీరో ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి కారణం ఆ దర్శకుడి ట్రాక్ రికార్డ్ అని చెబుతున్నారు. యూత్ ఫుల్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న ఆ డైరెక్టర్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

కానీ అతను ఇప్పటి వరకూ స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేదు. చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో ఓ సీనియర్ హీరోతో వర్క్ చేసే అవకాశం అందుకున్నాడు కానీ.. అది ప్లాప్ అవడంతో టైర్-2 హీరోలకే పరిమితం అయ్యాడు.

ఆ దర్శకుడు రీసెంట్ గా చేసిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మంచి ఓపెనింగ్స్ ఐతే రాబట్టగలిగింది కానీ.. అతను స్టార్ హీరోలను హ్యాండిల్ చేయగలడా అనే సందేహాలు కలిగేలా చేసింది. కాకపోతే ఈ మూవీ విడుదల కాకముందే ఆయనకు ఇద్దరు హీరోలు ఆఫర్స్ ఇచ్చారు.

వాళ్లిద్దరూ ఆశామాషీ హీరోలేం కాదు. ప్రతి ఒక్క దర్శకుడు ఒక్కసారైనా కలిసి వర్క్ చేయాలని కలలు కనే హీరోలు. అలాంటి వారితో సినిమా చేసే ఛాన్స్ దొరకడంతో అతనికి లక్ మామూలుగా లేదని అందరూ అనుకున్నారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. ఆ హీరోల అభిమానులు మాత్రం

ఈ ప్రాజెక్ట్స్ విషయంలో డిజప్పాయింట్ అవుతున్నారని తెలుస్తోంది. తమ హీరోల డెసిజన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి ఇమేజ్ కు రేంజ్ కు తగ్గ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోకుండా.. ఇలాంటి సినిమాలు చేయడం ఏంటని విమర్శిస్తున్నారు. అదే సమయంలో హీరోల నిర్ణయాన్ని సమర్ధించేవారు కూడా లేకపోలేదు.

ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఇద్దరు హీరోలు ఒకే దర్శకుడికి ఆఫర్ ఇచ్చారంటే.. అతని టాలెంట్ ఏంటనేది ఆలోచించాలల్సిన అవసరం ఉందని కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. అంత పెద్ద స్టార్స్ తో పని చేసే ఛాన్స్ వచ్చిందంటే కచ్చితంగా వారి ఇమేజ్ కు తగిన సినిమా చేసి ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.