Begin typing your search above and press return to search.

ఫాక్ట్ చెక్.. మెగా లీక్స్ కామెడీ అయ్యింది బాసు..!

By:  Tupaki Desk   |   10 Jun 2023 9:00 AM GMT
ఫాక్ట్ చెక్.. మెగా లీక్స్ కామెడీ అయ్యింది బాసు..!
X
మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య చిరు లీక్స్ అంటూ తన సినిమాల అప్డేట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా సినిమా నుంచి సంగీత్ సాంగ్ ని లీక్ చేస్తున్నానటూ ట్విట్టర్ లో వాయిస్ మెసేజ్ ఇచ్చి.. ఇన్ స్టాగ్రాం లో ఆ క్లిప్ రిలీజ్ చేశారు. చిరు సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కి ఈ లీక్స్ సూపర్ సర్ ప్రైజ్ అందిస్తున్నాయి. అంతే కాదు చిరు లీక్స్ అంటూ ఒక కొత్త ట్రెండ్ కూడా మొదలైందని చెప్పొచ్చు. అయితే అసలు ఈ చిరు లీక్స్ ఎప్పుడు ఎలా మొదలైంది అంటే.. ఆచార్య దగ్గర నుంచి అని తెలుస్తుంది.

కొరటాల శివ డైరెక్షన్ లో చిరు చరణ్ కలిసి చేసిన ఆచార్య ఇంకా టైటిల్ రివీల్ చేయకుండానే ఏదో సినిమా ఫంక్షన్ కి వెళ్లి చిరు టంగ్ స్లిప్ అయ్యి ఆచార్య అని టైటిల్ లీక్ చేశాడు. అలా చిరు లీస్ మొదలు పెట్టాడు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా టైం లో కూడా ఒక సాంగ్ ని చిరు స్వయంగా లీక్ చేశారు. ఆచార్య విషయం లో చిరు లీక్స్ బ్యాడ్ రిజల్ట్ ఇవ్వగా వాల్తేరు వీరయ్య సినిమా విషయం లో మాత్రం అది వర్క్ అవుట్ అయ్యింది. సినిమా మెగాస్టార్ చిరంజీవి ఖాతా లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక ఇదేదో బాగుంది అని చిరు లేటెస్ట్ గా తను చేస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి కూడా లీక్ ఇచ్చేస్తున్నారు. సినిమా నుంచి సంగీత్ సాంగ్ లీక్ చేసి మెగా ఫ్యాన్స్ ని అలరించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి చిరు లీక్స్ అంటూ తన సినిమాల అప్డేట్ ఇవ్వడం దాని కి లీక్ అని చెప్పడం కామన్ అయ్యింది. అదేదో ఎవరికీ తెలియకుండా చిరునే లీక్ చేస్తున్నాడని అనుకోవడం కష్టమే. చిరు లీక్స్ అని మెగాస్టార్ చెబుతున్నా ఇది సినిమా పబ్లిసిటీ లో ఒక భాగమే అని ఆడియన్స్ కనిపెట్టారు.

ఈ లీక్స్ విషయం లో చిరు చూపిస్తున్న గోప్యత వ్యవహారం పై కామెడీ కామెంట్స్ వస్తున్నాయి. చిరు లీక్ చేయకపోయినా పర్లేదు కానీ చిరు లీక్స్ అంటూ ఇలా కామెడీ చెయొద్దు బాస్ అని అంటున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ సినిమాల నుంచి చిరు లీక్స్ ద్వారా వస్తున్న ఈ అప్డేట్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాయి.

మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండ గా కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ రోల్ లో కనిపిస్తుంది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఆగష్టు 11న రిలీజ్ ఫిక్స్ చేశారు. వాల్తేరు వీరయ్య తర్వాత వస్తున్న ఈ మెగా మూవీ మీద అంచనాలు భారీ గా ఉన్నాయి.