Begin typing your search above and press return to search.

బాలయ్య బాబు సైక్లోన్ అనేసిన ఫ్యాన్

By:  Tupaki Desk   |   8 Dec 2021 6:32 AM GMT
బాలయ్య బాబు సైక్లోన్ అనేసిన ఫ్యాన్
X
అఖండ చిత్రంతో ఘ‌న‌విజ‌యం అందుకున్న జోష్ లో ఉన్నారు బాల‌య్య బాబు. వెంట వెంట‌నే సినిమాల్ని లాక్ చేస్తూ కెరీర్ ప‌రంగా మ‌రింత స్పీడ్ పెంచేస్తున్నారు. మ‌రోవైపు అభిమానులు వ‌న్ లైన‌ర్స్ ఈమోజీల‌ను షేర్ చేస్తూ.. బాల‌య్య పై త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు థమన్ అనేక మీమ్స్ వన్-లైనర్లను షేర్ చేస్తూ నందమూరి బాలకృష్ణ అభిమానులు అఖండ విజయంతో ఎలా ఆనందిస్తున్నారో వెల్లడించారు. బాలయ్యను ఆకాశానికి ఎత్తేసే క్రేజీ వన్ లైనర్ లలో కొన్నింటిని స్వయంగా తన ఫోన్ లో చూపించారు. ఆ వన్-లైనర్స్ ని ప‌రిశీలిస్తే..

బెండకాయ దొండకాయ - బాలయ్య బాబు గుండెకాయ
అన్నంలో పెరుగులేదు - బాలయ్య బాబులో తిరుగులేదు
వానొస్తే కరెంట్ కోతా - బాలయ్య బాబు గుండెల్లో మొతా
మినపట్టు.. పెసరట్టు - బాలయ్య బాబు తోటకొట్టు
రాముడు.. భీముడు - మా బాలయ్య దేవుడు
పసిఫిక్ ఒసేనా చాల దీపు- మా బాలయ్య తోపు
హౌస్ లోన్ - కార్ లోన్ - బాలయ్య బాబు సైక్లోన్

వ‌న్ లైన‌ర్స్ లో నిజంగానే అభిమానం బ‌య‌ట‌ప‌డుతోంది. త‌న‌పై ఉన్న అపార‌మైన ప్రేమ ఆరాధ‌నాభావానికి బాల‌య్య ఆనందం వ్య‌క్తం చేశారు. త‌న‌ని ఇంత‌గా అభిమానించే ఫ్యాన్స్ అంతా సంతోషంగా లేర‌ని క‌ష్టాల్లో ఉన్నార‌ని కూడా అన్నారు. త‌న అభిమానుల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని బాల‌కృష్ణ ఎమోష‌న‌ల్ అయ్యారు.

అన్నిచోట్లా అఖండ దూకుడు

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల‌కు ఏపీలో ఎదురే ఉండ‌ద‌న్న సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాంధ్ర‌.. రాయ‌ల‌సీమ జిల్లాల్లో బాల‌య్య బ్రాండ్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాల‌య్య బ్రాండ్ తోనే సినిమా మార్కెట్ అయిపోతుంది. మంచి టాక్ వ‌స్తే అదే బ్రాండ్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తారు. అయితే నైజాం లెక్క వేరే.

ఏపీలో భారీ వ‌సూళ్లు సాధించిన సినిమా కూడా నైజాంలో కొద్దిపాటి వ‌సూళ్ల‌తోనే స‌రిపెడుతుంది. బాల‌య్య ఇమేజ్ ఆ ప్రాంతంలో అంత‌గా ఇంపాక్ట్ చూపించద‌ని ఓ విమ‌ర్శ ఉంది. అయితే ఇప్పుడా లెక్క‌ల‌న్నింటిని `అఖండ` స‌రిచేసింది. నైజాం నుంచి `అఖండ‌`కు అనూహ్య స్పంద‌న ల‌భించింది.

ఆ లెక్క ఏ రేంజ్ లో వ‌ర్క‌వుటైందంటే తొలి వారంలోనే ఆ ప్రాంతం వ‌సూళ్ల‌తో బ్రేక్ ఈవెన్ సాధించింది. నైజాంలో `అఖండ` థియేట్రికల్ రైట్స్ 10.5 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే ఈ మొత్తాన్ని తొలి మూడు రోజుల్లోనే రాబ‌ట్టింది. ఆంధ్రా..రాయ‌ల‌సీమ జిల్లాలో మెజార్టీ థియేట‌ర్లో రిలీజ్ చేసి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టారు. అటు ఓవ‌ర్సీస్ లోనూ వ‌న్ మిలియ‌న్ క్లబ్ లో చేరింది అఖండ‌.

70 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా కేవ‌లం ఐదు రోజుల్లో 80కోట్ల వ‌సూళ్ల‌ను సాధించ‌డం ఒక సంచ‌ల‌నంగా చెబుతున్నారు. ఇది వంద కోట్ల క్ల‌బ్ లో చేరుతుంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిగా ద్వార‌కా క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు.

బాలీవుడ్ లో రీమేక్ కి రంగం సిద్ధం

`అఖండ‌` ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఇందులో కొత్త పాయింట్ ఏదైనా ఉంది అంటే అది దేవాల‌యాలు..హిందుత్వం గురించి హైలైట్ చేయ‌డ‌మే. సినిమా మొత్తానికి యూనిక్ గా క‌న‌పించే పాయింట్ ఇదే. కానీ సినిమా మాత్రం పూర్తి క‌మ‌ర్శిలైజ్డ్ చేసి తీసారు. స‌రిగ్గా ఈ పాయింట్ నే ఇప్పుడు బాలీవుడ్ మేక‌ర్స్ ని ఆక‌ర్షిస్తున్నట్లు క‌నిపిస్తోంది. `అఖండ‌`ని బాలీవుడ్ లో రీమేక్ చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

సాజిద్ న‌డియావాల స‌హా కొంద‌రు ద‌ర్శ‌కులు ఈ పాయిట్ ని హైలైట్ చేసి ఉత్త‌రాది ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు మ‌లిస్తే హిట్ కొటొచ్చన్న టాక్ వినిపించింది. అఖండ‌లో హిందూత్వ బావ‌జాలం ఎలిమెంట్ చాప‌కింద నీరులా హిందీ ఆడియెన్ ని తాకుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.