పఠాన్ థియేటర్లలో భయాన్ని చూపించిన ఫ్యాన్స్.. అల్లకల్లోలం!

Sun Jan 29 2023 19:25:45 GMT+0530 (India Standard Time)

Fans At Pathaan Theaters

అభిమానం అనేది ఒక లిమిట్ వరకు ఉంటేనే బాగుంటుంది. కానీ ఏమాత్రం హద్దులు దాటినా కూడా కొన్నిసార్లు అది ప్రాణం మీదకు కూడా తెస్తుంది. ఇటీవల కాలంలో అయితే ఫాన్స్ మరియు దారుణంగా తయారయ్యారు అనే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ అయితే థియేటర్లలో కొన్నిసార్లు చేస్తున్న పిచ్చి వేషాలు ఊహించని విధంగా అందరికీ కొంత భయాన్ని కూడా కలిగిస్తున్నాయి.ఈ క్రమంలో థియేటర్స్ కూడా చాలా వరకు ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రీసెంట్ గా పఠాన్ సినిమాను చూస్తున్న కొంతమంది అభిమానులు ఊహించిన విధంగా థియేటర్లో టపాసులు కాల్చడం భయాన్ని కలిగించింది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలోనే ఈ తరహా ఘటనలు జరిగాయి. కానీ ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీలో అయితే ఏకంగా థియేటర్లో పెద్ద తరహా టపాసులు కూడా పేల్చడం అందరికీ షాక్ కు గురి చేసింది.

సినిమా చూస్తున్న సమయంలో థియేటర్ లోనే బాల్కనీలో పాటు లోయర్ క్లాస్ లో ఉన్న ఫ్యాన్స్ కూడా టపాసులకు పేల్చారు. అయితే మరి కొందరు ఏకంగా పైకి వెళ్లే కొన్ని షాట్స్ కూడా పెల్చడం మరింత భయాన్ని కలిగించింది. థియేటర్ చుట్టూ మొత్తం కూడా టపాసులు మిగతా అభిమానులను కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులను కలిగించాయి. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఈ ఘటన గుజరాత్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ధియేటర్ యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ తరహా ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. థియేటర్లో కాస్త మంటలు చెలరేగిన కూడా ఆ తర్వాత తీవ్రస్థాయిలో నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ చేసే అతి చేష్టలకు ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో అని థియేటర్స్ యాజమాన్యాలు భయపడుతున్నాయి. ఇక పటాన్ సినిమా అయితే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్లు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అందుకొని దూసుకుపోతోంది.