Begin typing your search above and press return to search.

కన్ఫర్మ్ కాకుండా ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఏంటి?

By:  Tupaki Desk   |   28 Feb 2020 1:18 PM GMT
కన్ఫర్మ్ కాకుండా ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఏంటి?
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ఒక కీలకపాత్రలో నటించాల్సి ఉంది. అయితే చరణ్ 'RRR' తో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు కాల్ షీట్స్ కేటాయించలేకపోతున్నారట. దీంతో ఈ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తారని వార్తలు వచ్చాయి. ఈ విషయం #చిరు152 టీమ్ ఇంతవరకూ ధృవీకరించలేదు.

అయితే ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి-మహేష్ కాంబినేషన్ పై తెగ ఎగ్జైట్ అవుతున్నారు. మహేష్ కు కొరటాల శివ సన్నిహితుడనే సంగతి తెలిసిందే. దీంతో మహేష్ ను ఒప్పించి ఉంటాడని అనుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్లను వైరల్ చేస్తున్నారు. చిరంజీవి.. మహేష్ పాత ఫోటోలను ఫోటోషాప్ చేసి మరీ ఈ పోస్టర్లను డిజైన్ చేశారు. ఈ సినిమాకు 'గోవింద ఆచార్య'.. 'ఆచార్య' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అందుకే ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్లకు ఈ టైటిల్స్ పెట్టడం విశేషం. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు రియల్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు తీసిపోకుండా ఉన్నాయి. అయితే ఈ పోస్టర్లపై మరోవైపు సెటైర్లు కూడా పడుతున్నాయి. ఇంతవరకూ మహేష్ నటించే విషయం ఖరారు కాలేదు. ఇప్పుడే ఈ హంగామా ఏంటి.. ఫ్యాన్ మేడ్ పోస్టర్లు ఏంటి? అంటూ చిరాకు పడుతున్నారు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణెదెల ప్రొడక్షన్స్.. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్.. నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.