Begin typing your search above and press return to search.

కరెంట్‌ బిల్లు కట్టలేక పోతున్నా సాయం చేయండి అంటూ ఫ్యాన్స్‌ కు స్టార్‌ విజ్ఞప్తి

By:  Tupaki Desk   |   6 July 2020 5:45 AM GMT
కరెంట్‌ బిల్లు కట్టలేక పోతున్నా సాయం చేయండి అంటూ ఫ్యాన్స్‌ కు స్టార్‌ విజ్ఞప్తి
X
ఈ మద్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు కరెంటు బిల్లు విషయంలో సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు కరెంటు బిల్లు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ వరకు చాలా మంది స్టార్స్‌ కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా తమ గోడును చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సి కూడా కరెంట్‌ షాక్‌ కొట్టి బాబోయ్‌ అంటున్నాడు.

ఈయనకు లక్షకు మించిన కరెంట్‌ బిల్లు వచ్చిందట. దాంతో ఈ నటుడు తనకు కరెంటు బిల్లు చెల్లించేందుకు సాయం చేయమంటూ విజ్ఞప్తి చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు రిక్వెస్ట్‌ చేశాడు. ఈ నెల కరెంటు బిల్లు చెల్లించేందుకు గాను నా పెయింటింగ్స్‌ అమ్మకంకు పెట్టాను. దయచేసి వాటిని మీరు కొనుగోలు చేసి నాకు కాస్త ఆర్థిక వెసులుబాటు కల్పించండి అంటూ విజ్ఞప్తి చేశాడు. వచ్చే నెలలో కిడ్నీ అమ్మి కరెంట్‌ బిల్లు కట్టాల్సి వస్తుందేమో అంటూ వెటకారంగా అర్షద్‌ పోస్ట్‌ చేశాడు.