Begin typing your search above and press return to search.

ఫేస్ యాప్ ఛాలెంజ్.. కొత్త హంగామా ఇదే!

By:  Tupaki Desk   |   17 July 2019 5:27 PM GMT
ఫేస్ యాప్ ఛాలెంజ్.. కొత్త హంగామా ఇదే!
X
ఒక్కో సీజన్ లో ఒక్కో ఛాలెంజ్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అది ఐస్ బకెట్ ఛాలెంజ్ కావచ్చు.. స్వచ్ఛ భారత్ ఛాలెంజ్ కావచ్చు.. కికీ ఛాలెంజ్ కావచ్చు.. రీసెంట్ గా సోషల్ మీడియాను ఒక ఊపు ఆపేసిన బాటిల్ క్యాప్ ఛాలెంజ్ కావచ్చు.. సెలబ్రిటీల నుండి సాధారణ నెటిజన్ల వరకూ ఈ ఛాలెంజులలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే ఈమధ్య జోరుమీద ఉన్న బాటిల్ క్యాప్ ఛాలెంజ్ మెల్లగా మరుగున పడుతూ ఉంది. ఈ స్థానంలో తాజాగా #ఓల్డ్ ఏజ్ ఛాలెంజ్ వచ్చింది.

మిగతా ఛాలెంజ్ ల మాదిరిగా ఈ ఛాలెంజ్ కు పెద్దగా ఏమీ కష్టపడనవసరం లేదు. ఫేస్ యాప్ అనే అప్లికేషన్ లో మన ఫోటోను ఓల్డ్ ఏజ్ ఫిల్టర్ ను అప్లై చేస్తే మనం ముసలి వయసులో ఎలా ఉంటామో ఆ ఫోటోను మనకు చూపిస్తుంది. ఆ వయసు మళ్ళిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఛాలెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. డేవిడ్ బెకామ్ లాంటి సాకర్ స్టార్లు ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

బాలీవుడ్లో ఈ ఛాలెంజ్ ఇప్పటికే ఊపందుకుంది. అర్జున్ కపూర్.. వరుణ్ ధావన్.. ఆయుష్మాన్ ఖురానా లాంటి వారు ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. ఇక ఛాలెంజ్ లో పాల్గొనని సెలబ్రిటీల ఫోటోలను కూడా నెటిజన్లు ఫేస్ యాప్ లో వేసి సదరు వయసు మళ్ళిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో సల్మాన్ ఖాన్ నుండి కొత్తగా బాలీవుడ్ లో సత్తా చాటిన హీరో విక్కీ కౌశల్ వరకూ ఉన్నాయి. టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా ఈ ఫేస్ యాప్ నుండి తప్పించుకోలేకపోయారు.

ఇదంతా బాలీవుడ్ సంగతి. టాలీవుడ్ కు వస్తే ఇంకా ఈ ఛాలెంజ్ లో ఎవరూ పాల్గోననలేదు కానీ నెటిజన్లు అందరి ఫోటోలకు ఈ ఫేస్ యాప్ ఫిల్టర్ తగిలించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెస్తున్నారు. మహేష్ బాబు.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. పవన్ కళ్యాణ్ లాంటి చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోల ఓల్డ్ ఏజ్ లుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.