Begin typing your search above and press return to search.

వారియ‌ర్స్ పేరుతో FCUK ప్ర‌చార‌మా?

By:  Tupaki Desk   |   24 Jan 2021 10:15 AM GMT
వారియ‌ర్స్ పేరుతో FCUK ప్ర‌చార‌మా?
X
క‌రోనా మ‌హమ్మారీ వేళ సోనూసూద్ ఎంద‌రో కార్మికుల‌కు దేవుడ‌య్యాడు. అది అత‌డి ప్ర‌చారానికి కూడా క‌లిసొచ్చిన మాట వాస్త‌వం. అలా చాలామంది ట్రై చేసినా అంత పేరు అయితే రాలేదు. ఇక ఫ్రంట్ లైన్ కార్మికులకు FCUK బృందం ప్రత్యేక నివాళి ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతూ చ‌ర్చ‌ల్లోకొచ్చింది.

జగపతి బాబు న‌టిస్తున్న‌ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది `ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్` (ఎఫ్.సి.యు.కె) అనేది ఫుల్ ఫామ్. ఈ మూవీకి స‌రికొత్త ప్ర‌చార షెడ్యూల్ ని ప్లాన్ చేసింది చిత్ర‌బృందం. మ‌హ‌మ్మారీ వేళ విధి నిర్వ‌హ‌ణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి నిస్వార్థంగా కృషి చేసిన ఫ్రంట్ లైన్ కార్మికులకు ప్రత్యేకమైన నివాళి అర్పించడానికి సిద్ద‌మ‌వుతున్నారు. ఈ సినిమా పాటలను మునుముందు ఈ నిజ జీవిత హీరోలు కొందరు లాంచ్ చేయ‌నున్నారు.

FCUK పాటలను వైద్యులు.. పోలీసులు.. మునిసిపల్ కార్మికులు .. ఎంపిక చేసిన‌ మీడియా ప్ర‌తినిధుల చేతుల‌మీదుగా ఆవిష్క‌రించ‌నున్నారు. మొదటి పాటను ప్రముఖ డాక్టర్ శ్రీ గుర్వరెడ్డి విడుదల చేస్తారు. ఈ చిత్ర దర్శకుడు విద్యాసాగర్ రాజు .. నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఆ మేర‌కు చొరవను తీసుకున్నారు. COVID-19 కు వ్యతిరేకంగా ఫ్రంట్ లైన్ యోధులుగా ఉన్న ధైర్యవంతుల గొప్ప హృదయాలకు ఈ టీమ్ స‌భ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎఫ్‌.సి.యు.కెలో .. రామ్ కార్తీక్- అమ్ము అభిరామి- బేబీ సహశ్రీత ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.