Begin typing your search above and press return to search.

సరికొత్త పోస్టర్ తో వరుణ్ తేజ్ కి 'ఎఫ్ 3' టీమ్ బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   19 Jan 2022 5:00 AM GMT
సరికొత్త పోస్టర్ తో వరుణ్ తేజ్ కి ఎఫ్ 3 టీమ్ బర్త్ డే విషెస్..!
X
విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''ఎఫ్ 3''. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇది 2019 సంక్రాంతి సీజన్ లో సూపర్ హిట్ అయిన 'ఎఫ్ 2' ఫ్రాంచైజీ మూవీగా రూపొందుతోంది. సమ్మర్ లో ట్రిపుల్ ఫన్ అందించడానికి వస్తున్న ఫన్-ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సంబంధించిన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.

నేడు (జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా 'ఎఫ్ 3' టీమ్ సరికొత్త పోస్టర్ తో హీరోకి శుభాకాంక్షలు తెలియజేసింది. ఇందులో వరుణ్ డ్యాన్స్ పోజ్ ఇచ్చి, కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. సినిమా కథంతా డబ్బు చుట్టూనే తిరుగుతుందని చెప్పడానికి గుర్తుగా పోస్టర్ లో కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ కూడా తన చేతిలో ₹ 2000 నోటు పట్టుకొని ఉండటాన్ని ఇక్కడ గమనించవచ్చు.

''ఎఫ్ 3'' చిత్రాన్ని 2022 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ముందుగా ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు విడుదల తేదీని ఒకరోజు ముందుకు తీసుకెళ్లారు. 'ఎఫ్ 2' తో సక్సెస్ అందుకున్న సంక్రాంతి అల్లుళ్లుగా.. ఈసారి సమ్మర్ సోగ్గాళ్ళుగా థియేటర్లలో నవ్వుల అల్లర్లు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. సినీ వర్గాల్లో మరియు ట్రేడ్ సర్కిల్లలో పాజిటివ్ బజ్ ఉన్నందున ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

కాగా, 'ఎఫ్ 3' చిత్రంలో వెంకటేష్ కు సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాకు మరింత గ్లామర్ జోడించడానికి బాలీవుడ్ బ్యూటీ సోనాలి చౌహన్ మూడో హీరోయిన్ గా ఎంపిక చేశారు. సునీల్ - రాజేంద్ర ప్రసాద్ - వెన్నెల కిషోర్ - మురళీ శర్మ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - అన్నపూర్ణ - వై. విజయ - ప్రగతి - పృథ్వీరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

'ఎఫ్-2' కి చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. 'ఎఫ్ 3' కోసం సూపర్ హిట్ ఆల్బమ్ రెడీ చేస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ కృష్ణ స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ గా.. ఆది నారాయణ - నారా ప్రవీణ్ అడిషనల్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.