సంక్రాంతి బరిలో 'ఎఫ్ 3'.. కన్ఫార్మ్ చేసిన వెంకీ..!

Sat Jul 31 2021 14:16:42 GMT+0530 (IST)

F3 Movie In Sankranthi race

విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ''ఎఫ్ 3''. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం సంక్రాంతి కి వచ్చి సూపర్ హిట్ అయిన 'ఎఫ్-2: ఫన్ అండ్ ఫస్ట్రేషన్' ఫ్రాంచైజీలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలపై వెంకటేష్ క్లారిటీ ఇచ్చేశారు.నిజానికి 'ఎఫ్ 3' చిత్రాన్ని ఆగస్ట్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అప్పట్లో ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం వల్ల షూటింగ్ జరిపే పరిస్థితి లేకపోవడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అందరూ రిలీజ్ డేట్స్ ని రీ షెడ్యూల్ చేసుకుంటున్న నేపథ్యంలో 'ఎఫ్ 3' చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

నిన్న శుక్రవారం 'నారప్ప' సక్సెస్ మీట్ లో మాట్లాడిన వెంకటేష్.. 'ఎఫ్ 3' చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలువుతున్నట్లు ప్రకటించారు. బ్రహ్మాండమైన సంక్రాంతి పండుగ సీజన్ లో వచ్చి మీ అందర్నీ నవ్విస్తానని వెంకీ పేర్కొన్నారు. దీంతో ఈసారి ఫెస్టివల్ సీజన్ లో పోటీ మరింత ఎక్కువైనట్లు అయింది. ఎందుకంటే ఇప్పటికే మహేష్ బాబు 'సర్కారు వారి పాట'.. పవన్ కళ్యాణ్ - రానా 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్.. ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రాలను అదే టైంలో రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు 'ఎఫ్ 3' కూడా జాబితాలో చేరింది. దీనిని బట్టి చూస్తే వచ్చే సంక్రాంతి చాలా రసవత్తరంగా ఉండబోతోందని అర్థం అవుతోంది.

కాగా 'ఎఫ్ 2' చిత్రంలోని పాత్రలను కొనసాగిస్తూ మరింత ఫన్ తో ''ఎఫ్ 3'' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్ - వరుణ్ తేజ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా - మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ - సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి ఈ aచిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఎఫ్ 3' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.