ఎన్బీకేతో `ఎఫ్ 2` డైరెక్టర్.. ఏది నిజం?

Sat Apr 20 2019 14:20:27 GMT+0530 (IST)

F2 Director With NBK Which Is True

నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఎన్ బీకే ఫిలింస్ పతాకంపై తెరకెక్కించిన కథానాయకుడు- మహానాయకుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం నందమూరి అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అయితే తదుపరి బాలకృష్ణ నటించే సినిమాలేవి? అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే సింహా లెజెండ్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాని ప్రారంభిస్తారని ప్రచారమైంది. ఎన్నికల ఫలితాల అనంతరం దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.మరోవైపు ఎన్‌బీకే - వినాయక్ కాంబినేషన్ సినిమా ఉందా లేదా? అన్న ఆసక్తికర చర్చా ఫిలింనగర్ లో వేడెక్కిస్తోంది. ఈ కాంబినేషన్ మూవీ గురించి నిర్మాత సి.కల్యాణ్ ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు వినాయక్ తో కలిసి `ఎఫ్ 2` డైరెక్టర్ అనీల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ లో ప్రచారమవుతోంది. అయితే వి.వి.వినాయక్ తో అనీల్ రావిపూడి అలయెన్స్ అయ్యారా? అంటే దానిపై సరైన క్లారిటీ మిస్సయ్యింది. ఇదే ప్రశ్న అనీల్ రావిపూడినే ప్రశ్నించింది తుపాకి. దీనిపై ట్యాలెంటెడ్ డైరెక్టర్ స్పందించారు.

``బాలకృష్ణ -  వినాయక్ మూవీకి స్క్రిప్టు చేయాల్సింది.. కానీ కుదరలేదు.. ప్రస్తుతం వేరే కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నాను`` అని అనీల్ రావిపూడి `తుపాకి`కి తెలిపారు. మహేష్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు - అనీల్ సుంకర నిర్మించే సినిమా త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీప్రొడక్షన్ పనులతో పాటు కాస్టింగ్ సెలక్షన్స్ సాగుతున్నాయి. నేడు హైదరాబాద్ లో జరిగిన `బ్రోచేవారెవరురా` మీడియా ఈవెంట్ లో అనీల్ రావిపూడి పాల్గొన్నారు. `బ్రోచేవారెవరురా` టీజర్ ఇంప్రెస్సివ్ గా ఉంది. మరో కొత్త పంథా సినిమా వస్తోంది! అంటూ ప్రశంసించారు.