Begin typing your search above and press return to search.

ఎక్సక్లూసివ్ : అల్లరి నరేష్ తో స్పెషల్ చిట్ చాట్

By:  Tupaki Desk   |   29 Jun 2020 2:00 PM GMT
ఎక్సక్లూసివ్ : అల్లరి నరేష్ తో స్పెషల్ చిట్ చాట్
X
* 57 సినిమాలు అందులో దాదాపు 50కి పైగా హీరోగా నటించిన సినిమాలు ఉన్నాయి, ఈ జనరేషన్ హీరోల్లో మీకే ఇది సాధ్యం అయ్యింది, ఎలా అనిపిస్తుంది?

దేవుడు ఇచ్చిన వరం అండి, కామెడీ హీరో ని అందరు యాక్సప్ట్ చేస్తారు. అందుకే నేను ఇన్ని సినిమాలు అంత త్వరగా చేయగలిగాను. ఐతే నా 18 ఇయర్స్ కెరీర్ లో మధ్య మధ్యన చిన్న చిన్న బ్రేక్స్ వచ్చిన, ఇన్ని సినిమాలు నేను నటించేలా చేసిన డైరెక్టర్స్, రైటర్స్ అలానే నిర్మాతలకు అందరికి నేను రుణ పడి ఉంటాను. ఐతే ఒక్కటి మాత్రం నిజం. నేను అల్లరి చేసిన తరువాత వచ్చిన మిక్సడ్ టాక్ కి మహా ఐతే 5 సినిమాలు చేస్తానేమో అనుకున్నా. ఎందుకో 5 అనే ఫిగర్ అలా అప్పుడు నా మైండ్ కి తట్టింది.

* మీ 5 సెంటిమెంట్ నిజం అయ్యిందిగా, 50 లో కూడా 5 ఉంది కదా?

(నవ్వులు) యా అవునండి నిజమే కదా, నాకే తట్ట లేదు ఇప్పటి వరకు. థాంక్ యూ

* అన్ని వర్గాలు ప్రేక్షకులకు దగ్గరైన అతి కొద్ది మంది టాలీవుడ్ హీరోల్లో మీరు ఉన్నారు, ఇది నాన్నగారు దగ్గర నుంచి నేర్చుకున్నారా లేక మీ హార్డ్ వర్క్ అంటారా?

నేను మీకు ముందు చెప్పినట్లుగా కామెడీ హీరోలను ఆడియన్స్ తమ ఇంట్లో మనిషిగా ట్రీట్ చేస్తారు. ఈ విషయంలో నాకు ఎదురైనా కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్లు మీతో షేర్ చేసుకుంటాను, మా నాన్నమ్మ గారు హాస్పిటల్ లో ఉన్నపుడు, ఒక నర్స్ నా దగ్గరకు వచ్చి, నరేష్ గారు హాస్పిటల్ లో రోజు పని చేసి చేసి ఇంటికి వెళ్ళాక కూడా ఈ నెగటివిటి నుంచి తప్పించుకోవడానికి మీ సినిమాలు పెట్టుకొని చూస్తాము అంది. ఒక యెన్ఆర్ఐ సింపుల్ గా ఒకటే మాట చెప్పడు, మీ సినిమా మా ఇంట్లో వస్తుంది అంటే ఆ ముందు రోజు మా ఇంట్లో గొడవ అయ్యినట్లే. గొడవలు నుంచి బయటపడటానికి మీ సినిమాలు చూస్తాము అన్నాడు. ఇంత కంటే ఏం కావాలి అండి. నాన్నగారి నుంచి నేర్చుకున్న కామెడీ నే ప్రధానంగా నా సినిమా కెర్రిర్ ని కొనసాగించడం వల్లే కదా నాకు ఇలాంటి అరుదయిన అనుభవాలు దక్కుతున్నాయి. అన్నట్లు ఆ యెన్ఆర్ఐ కి నేను ఒక్క మాటే చెప్పను సినిమాలు చూడండి కానీ గొడవలు పడకండి అని..!

* కరోనా కారణంగా ఇండస్ట్రీ బాగా దెబ్బతింది అనే వాదన మీ స్పందన?

ఇది ఐతే నిజం..! ఐతే సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఈ ప్రభావం ఉంది. ఐతే ఎక్కువ మాట్లాడుకునే సెక్టార్స్ లో చిత్ర పరిశ్రమ ఉండటం వలన మన మీద అందరి దృష్టి ఉంది అని నా అభిప్రాయం.

* నాంది లో సీరియస్ రోల్ చేశారు ఎందుకని?

మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్ ని బట్టి మనం మారాలి. ఐతే అలా అని కామెడీ ని వదిలేయాను. నాంది తో స్టార్ట్ చేస్తే ఇక ప్రతి రెండు కామెడీ సినిమాలు తరువాత ఒక డిఫరెంట్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. అన్ని రకాల పాత్రలు చేయాలని నా అభిలాష. అందుకే మీరు గమనిస్తే కెర్రిర్ మొదటి నుంచి కూడా నేను వేరే హీరోల సినిమాల్లో కూడా నటించాను. మరో విషయం కితకితలు బాగుటుంది, బెండు అప్పారావు బావుంటుంది ఇవీ నా సినిమాలకి వచ్చే ప్రశంసలు. కానీ నా పెర్ఫార్మన్స్ గురించి మాట్లేడే సినిమాలు గమ్యం, శంభో శివ శంభో, మహర్షి. ఇప్పుడు నాంది కూడా నన్ను నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాను.

* బంగారు బుల్లోడు లో కామెడీ ఉండబోతుందా?

ఇది మళ్ళీ నేను రెగ్యులర్ స్టయిల్ అఫ్ మూవీ. ఐతే ఈ మధ్య నేను వేసిన రాంగ్ మూవ్స్ ఇందులో కనిపించవు.

* మళ్ళీ EVV గారి బ్యానర్ లో సినిమాలు చేస్తారా?

చేస్తాము అండి, నేను హీరోగా కంటే నిర్మాతగా మా బ్యానర్ ని ముందుకు నడిపించాడనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. మా బ్యానర్ లో బయట హీరోలతో సినిమాలు చేయాలనీ నా ప్లాన్. అన్నయ్య రాజేష్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కథలు వింటున్నాము.

* EVV బ్యానర్ తీయబోయే సినిమాలు, మీ నాంది అలానే బంగారు బుల్లోడు ప్రాజెక్ట్స్ మంచి రిజల్ట్స్ అందుకోవాలని మా తుపాకీ టీం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, థాంకు యూ సో మచ్ ఆల్ ది బెస్ట్

తుపాకీ రీడర్స్ అందరికి నా మనవి, కరోనా లాక్ డౌన్ నుంచి ప్రభుత్వం రిలాక్సేషన్ ఇచ్చినప్పటికీ అత్య అవసరం అనుకుంటేనే బయటకు రండి. "ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్" ఆల్ ది బెస్ట్