Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత అంతా స్లో అవుతారు.. కానీ నితిన్ స్పీడ్ పెంచాడు

By:  Tupaki Desk   |   22 Feb 2021 4:02 AM GMT
పెళ్లి తర్వాత అంతా స్లో అవుతారు.. కానీ నితిన్ స్పీడ్ పెంచాడు
X
నితిన్ హీరోగా వింక్ బ్యూటీ ప్రియ ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా రకుల్ ప్రీక్ కీలక పాత్రలో నటించిన చెక్ మూవీ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ రాజమౌళి మరియు నితిన్ ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

వరుణ్ మాట్లాడుతూ.. కాలేజ్ డేస్ నుండి కూడా రాజమౌళి గారి సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం. ఆయన గురించి మాట్లాడే సందర్భం నాకు ఎప్పుడు రాలేదు. ఈ రోజు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోటం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన చెప్పినట్లుగా పెద్ద కలలు కనాలి అనే ఉద్దేశ్యం తో నే భారీ సినిమాలు వస్తున్నాయి. టాలీవుడ్ కు ఈ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆయనే అన్నాడు.

ఇక నితిన్ గురించి మాట్లాడుతూ ఎవరైనా పెళ్లి తర్వాత కాస్త స్లో అవుతారు. కానీ నితిన్ మాత్రం ఇప్పటికే నాలుగు సినిమాల డేట్లు ప్రకటించాడు. వరుస సినిమాలలో మాకు చెక్ పెడుతున్నాడు అంటూ కామెంట్ చేశాడు. నువ్వు మరి టూమచ్ గా ట్రాఫిక్ పెంచేశావు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. చెక్ స్టోరీ నాకు నితిన్ చెప్పాడు. ఇది తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది నమ్మకంగా ఉంది అన్నాడు. చెక్ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.