#రిలీజ్ సస్పెన్స్.. ఆ రెండు ఆశలు నెరవేరేదెలా?

Thu Sep 23 2021 11:15:29 GMT+0530 (India Standard Time)

Everything eagerly awaited for decision of the AP CM

సినీ ప్రియులకు ఆ డేట్ చాలా ఇంపార్టెంట్. ఆరోజు ప్రధానంగా ఓ రెండు కోరికలు నెరవేరేలా కనిపించడం లేదు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్ లో థియేటర్లు తెరుచుకున్నా ఇప్పటి వరకు నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వలేదు. దీని కోసం టాలీవుడ్ వర్గాలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. అంతే కాకుండా కొత్త సినిమాలు రిలీజైనప్పుడు క్రేజ్ ని బట్టి సెకండ్ షోకు అనుమతులు ఇస్తారని కూడా టాలీవుడ్ ప్రముఖులు ఆశగా చూస్తున్నారు. అయితే ఈ రెండూ ఈ నెల 24న నెరవేరతాయని అంతా భావించారు.



కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ రెండూ నెరవేరేలా కనిపించడం లేదు. ఈ వారం అంటే ఈ నెల 24న సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య- సాయి పల్లవి నటించిన `లవ్ స్టోరీ` విడుదల కాబోతోంది. ఈ మూవీ రిలీజ్ కి ముందే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీకి.. సెకండ్ షో ప్రదర్శనకు అనుమతులు ఇస్తుందని ఎగ్జిబిటర్లు.. డిస్ట్రిబ్యూటర్ లు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ అది నెరవేరేలా కనిపించని పరిస్థితి.

ఈ రెండు విషయాలపై మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందించినా ఆరోగ్య శాఖ మాత్రం ఈ ప్రతిపాదనని తిరస్కరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు విషయాలపై నిర్ణయాన్ని సీఎం జగన్ కు వదిలేశారు. ఇప్పుడు బాల్ ఆయన కోర్టులో వుంది. సీఎం యస్ అంటేనే ఈ రెండు అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది .. లేదంటే లేదు. అయితే ఏ నిర్ణయం వెలువడినా గురువారం వరకే కాబట్టి ఏపీ సీఎం నిర్ణయం కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మంత్రి పేర్ని నాని తలుచుకుంటే ఈ విషయంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించే అవకాశం వుంది కానీ మంత్రి పేర్ని నాని జిల్లా పరిషత్ ఎన్నికల్లో బిజీగా వుండటం వల్ల అది కుదిరేలా కనిపించడం లేదు అని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి. ఎవరు ఏం తలుచుకున్నా ప్రభుత్వ పోర్టల్ లోనే టిక్కెట్లు కొనాలి. టికెట్ ధరలు ఏమేరకు పెరుగుతాయో క్లారిటీ లేదు. బెనిఫిట్ షోలను పూర్తిగా రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు.