రీమేక్ ఆయనే చేయాలని అందరి కోరిక

Thu Jul 22 2021 07:00:02 GMT+0530 (IST)

Everyone wants to do the remake with him

తమిళంలో రూపొందిన సూరారై పోట్రూ ఏకంగా ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లింది. అలాంటి సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ హిందీ నిర్మాత విక్రమ్ మల్హోత్రతో కలిసి సూర్య ఈ సినిమా ను హిందీలో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. హిందీ వర్షన్ ను కూడా సుధ కొంగర తెరకెక్కించబోతున్నారు. ఒరిజినల్ వర్షన్ ను అద్బుతంగా తెరకెక్కించిన ఆమె రీమేక్ లో స్వల్పంగా మార్పులు చేర్పులు చేసి హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మారుస్తున్నారట.

ఇక ఈ సినిమా లో సూర్య పోషించిన కెప్టెన్ గోపీనాథ్ పాత్రను ఎవరు పోషిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఒక మీడియా సంస్థ ఆన్ లైన్ లో ఒక సర్వేను నిర్వహించింది. అందులో ఈ రీమేక్ లో ఎవరు అయితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అంటూ ప్రశ్నించింది. అందుకు గాను ఎక్కువ శాతం మంది హృతిక్ రోషన్ కు ఓటు వేశారు.

ఏకంగా 67 శాతం మంది హృతిక్ రోషన్ ను ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నట్లుగా చెప్పగా 20 శాతం మంది మాత్రం అజయ్ దేవగన్ ను ఆ పాత్రలో చూడాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. 13 శాతం మంది రణవీర్ సింగ్ ఆ పాత్రకు సెట్ అవుతాడనే అభిప్రాయంను వ్యక్తం చేశారు.

మొత్తానికి సూరారై పోట్రూ రీమేక్ ను హృతిక్ రోషన్ తో చేస్తే అద్బుతంగా ఉంటుందనే అభిప్రాయంను వారు వ్యక్తం చేశారు. కాని హృతిక్ రోషన్ కు ఉన్న కమిట్‌మెంట్స్ నేపథ్యంలో ఈ రీమేక్ కు ఒప్పుకోక పోవచ్చు అంటున్నారు. ఇక ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో ఒక యంగ్ స్టార్ హీరోతో తెరకెక్కించేందుకు గాను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ విషయమై మరింత స్పష్టత వస్తుందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ రీమేక్ ను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా విక్రమ్ మల్హోత్రా పేర్కొన్నారు.