అందరూ ఆ క్రేజీ మూవీస్ ని మర్చిపోయారుగా...?

Sat Jul 04 2020 23:04:46 GMT+0530 (IST)

Everyone forgot all those crazy movies ...?

దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సుమారు నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ మూతబడి ఉంది. సినిమా షూటింగ్స్ ఆగిపోయి.. థియేటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అవడంతో సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చెప్పలేని పరిస్థితి ఏర్పడటంతో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని ఓటీటీ రీలీజ్ కి రెడీ అవుతున్నాయి. అయితే కరోనా లాక్ డౌన్ కి ముందే కంప్లీట్ అయిన కొన్ని సినిమాలు అటు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవుతాయా లేదా థియేటర్స్ రీ ఓపెన్ చేసే వరకు వెయిట్ చేస్తారా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అందులోనూ ఆ సినిమాల గురించి సినీ ప్రేక్షకుల్లో డిస్కషన్స్ కూడా లేవు.వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'.. నాని - సుధీర్ బాబు కలిసి యాక్ట్ చేసిన మల్టీస్టారర్ 'వి'.. రామ్ పోతినేని నటించిన 'రెడ్'.. అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'నిశ్శబ్దం' సినిమాల గురించి చెప్పుకోవచ్చు. నిజానికి ఈ సినిమాలన్నీ సమ్మర్ కానుకగా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినవి. కానీ మహమ్మారి వైరస్ కారణంగా ప్లాన్స్ అన్నీ పాడు చేసి రిలీజ్ కాకుండా చేసింది. అయితే ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. ఏ ఫార్మాట్ లో రిలీజ్ అవుతాయనేది పక్కన పెడితే అసలు సినీ అభిమానులు ఈ సినిమాలను మర్చిపోయే పరిస్థితులు వచ్చాయని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఈ సినిమాలకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ బయటకి రాలేదు. లాక్ డౌన్ కి ముందు హడావిడి చేసిన ఈ సినిమాలు ఇప్పుడు సైలెంటుగా ఉంటున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే కరోనా పోయేలోపు అందరూ ఈ సినిమాలని మర్చిపోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇదే కనుక జరిగితే ఇప్పటి దాకా చేసిన పబ్లిసిటీని పక్కన పెట్టి అప్పుడు కొత్తగా మళ్ళీ మొదటి నుండి పబ్లిసిటీ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు మాత్రం ఇప్పట్లో రిలీజ్ చేయలేమని తెలిసినా మా ట్రైలర్ కి అన్ని వ్యూస్ వచ్చాయని.. మా సాంగ్ కి ఇన్ని కోట్ల వ్యూస్ వచ్చాయని జనాల్లో ఏదొక విధంగా ఉంటున్నాయి. వాటిలో 'ఉప్పెన' 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాని చెప్పుకోవచ్చు. మరి మిగితా సినిమాలు ఇప్పుడు పబ్లిసిటీ చేసినా ఎలాగూ కరోనా డేస్ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సిందే అనే ఆలోచనలో ఉండి సైలెంటుగా ఉన్నారేమో అని సినీ అభిమానులు అనుకుంటున్నారు.