విడిపోయినా స్నేహితులుగా కలిసే ఉంటారు!

Tue Jan 25 2022 12:05:33 GMT+0530 (IST)

Even if they break up they will still be friends

ధనుష్-ఐశ్వర్య జంట బ్రేకప్ ప్రకటన షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక బంధానికి పుల్ స్టాప్ పెడుతూ విడాకులు  తీసుకుంటున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. సమంత-నాగచైతన్య తర్వాత విడిపోయిన రెండవ సౌత్ జంటగా ఫేమస్ అయ్యారు. అయితే ఈ జంటని కలపడానికి ఇప్పటికీ ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో ప్రచారం సాగుతోంది. పెద్దలు రజనీకాంత్... ధనుష్ తండ్రి కస్తూరి రాజా ప్రయత్నిస్తున్నట్లు.. త్వరలోనే కలుస్తారని ఆశిస్తున్నట్లు రాజా తెపడం విశేషం.

ఆ సంగతిని పక్కనబెడితే  విడాకుల నిర్ణయం తర్వాత ధనుష్-ఐశ్వర్య తమ సమయాన్ని మాత్రం వృథా చేయడం లేదు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. ఐశ్వర్య మళ్లీ సినిమాలపై  దృష్టి పెట్టి దర్శకురాలిగా బిజీ అవ్వాలని చూస్తున్నారుట. దీనిలో భాగంగా స్టోరీ డిస్కషన్స్..మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. అలాగే ధనుష్ `సార్` సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. ఇలా ఎ వరి పనుల్లో వాళ్లు బిజీ అయినట్లు తెలుస్తోంది. అయితే ధనుష్--ఐశ్యర్య హైదరాబాద్లో ని ఓ హోటల్ లో ఉంటున్నారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

ఐశ్వర్య హైదరాబాద్ హాటల్ లోని మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నట్లు ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. అయితే విడాకుల తర్వాత ఈ మాజీ జంట కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టుకోలేదని తెలుస్తోంది. మ్యూజిక్ వీడియోలో ధనుష్ కూడా భాగం అవుతున్నాడు. ఇద్దరు జంటగానే ఈ వీడియోకి సంబంధించి పనుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ధనుష్ హీరోగా...ఐశ్వర్య దర్శకత్వంలో మరిన్ని సినిమాలు తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. భార్యభర్తలుగా విడిపోయినా  స్నేహితులుగా కలిసే ఉంటారు.