20 ఇయర్స్ అయినా జోరు తగ్గలేదు!

Sat Sep 24 2022 20:54:03 GMT+0530 (India Standard Time)

Even after 20 years the force has not decreased

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలని 4కెలోకి రీ మాస్టర్ చేసి రీరిలీజ్ చేయడం సరికొత్త ట్రెండ్ గా మారింది. మహేష్ నటించిన `పోకిరి` మూవీతో ఈ ట్రెండ్ కి నాంది పలికారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ నటించిన `జల్సా` లైన్ లోకి రావడం.. `పోకిరి` రీ రిలీజ్ రికార్డుల్ని తిరిగరాయడం తెలిసిందే.ఇదిలా వుంటే ఇప్పడు ఇలాంటి ట్రెండ్ ని ప్రతీ హీరో ఫ్యాన్స్ తమ హీరోలు ఫాలో కావాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రతీ హీరో పుట్టిన రోజున ప్రత్యేకంగా వారి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచిన సినిమాలని రీ మాస్టర్ చేసి 4కె లో రీరిలీజ్ చేయాలనే డిమాండ్ లు పెరిగిపోతున్నాయి.

త్వరలో `వర్షం` 4కె ప్రింట్ ని రెడీ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయడంతో దానికి సంబంధించిన పనుల్ని ఇప్పటికే మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే సూపర్ స్టార్ కృష్ణ నటించిన `సింహాసనం` 8కెలో రాబోతంంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తి అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తాయితే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఇప్పడు బాలయ్య సినిమాని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.

20 ఏళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ హీరోగా వి.వి.వినాయక్ తెరకెక్కించిన ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ `చెన్నకేశవరెడ్డి`. ఈ మూవీ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ లోనూ శని ఆదివారాలు రెండు రోజుల పాటు భారీ స్థాయిలో ప్రత్యేక షోలని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో  ప్రసాద్ మల్టీప్లెక్స్ లో శనివారం ఈ మూవీ స్పెషల్ షోలు మొదలయ్యాయి.

20 ఏళ్లు పూర్తయినా ఏ మాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ మూవీ కలెక్షన్ లని రాబట్టినట్టుగా తెలుస్తోంది. యుఎస్ వ్యాప్తంగా 82 స్పెషల్ షోలు వేశారు. ఈ షోల ద్వారా 39 0544 డాలర్లు ఆస్ట్రేలియాలో 11500 డాలర్లు గ్రాస్ ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ మూవీ యుఎస్ ఆస్ట్రేలియాలో స్పెషల్ షోల ద్వారా అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.