సాహో నటికి త్వరలోనే పెళ్లి

Wed Oct 09 2019 14:02:36 GMT+0530 (IST)

Evelyn Sharma Engaged to Boyfriend Tushaan Bhindi

జర్మనీలో పుట్టిన ఎవెలిన్ శర్మ 'ప్రమ్ సిడ్నీ విత్ లవ్' సినిమాతో హిందీ ప్రేక్షకులకు చేరువైంది. ఆ తరవాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. 'సాహో' లాంటి భారీ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ఈ సినిమాలో ఆమె ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ చేసింది. పంజాబీ - ఉర్దూ లాంటి చాలా భాషల్లో ఆమె ప్రయత్నించింది. కానీ ఎక్కడా ఆమెకు అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. దీంతో ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. ప్రేమించిన వరుడితోనే ఆమె పెళ్లి జరుగుతుందని తాజాగా ఆమె ప్రకటించింది.ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్ సర్జన్ తుషన్ బైనండి తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతోపాటు ఆమె తుషన్ తో తాను దిగిన ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. సిడ్నీలో ఎంతో పేరున్న హార్బర్ బ్రిడ్జ్ బ్యాక్ గ్రౌండ్ లో ఆమె తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఆమె తుషన్ తో చాలాకాలం నుండి డేటింగ్ లో ఉంది. ఈ పిక్స్ చూసిన ఆమె అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. తనను విష్ చేసిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం ఎవెలిన్ తన పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.